Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-08 10:44:27
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- ఆల్రెడీ ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ఇప్పుడు తొమ్మిదో సీజన్ కు ముస్తాబవుతోంది. తెలుగులో బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ ను జూ. ఎన్టీఆర్హో స్ట్ చేసి దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయడంతో పాటూ ఎన్టీఆర్ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత రెండో సీజన్ ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేసినప్పటికీ నాని యాంకర్ గా పెద్దగా సక్సెస్ అవలేకపోయాడు.దీంతో బిగ్ బాస్ హోస్టింగ్ బాధ్యతల్ని నాగార్జునకు ఇచ్చారు. నాగార్జునకు ఆల్రెడీ యాంకర్ గా మంచి అనుభవం ఉండటంతో బిగ్ బాస్ ను చాలా సక్సెస్‌ఫుల్ గా నడిపించుకుని వచ్చారు. అయితే ఇప్పుడు నాగార్జున బిగ్ బాస్ చేయడానికి ఆసక్తిగా లేడని తెలుస్తోంది. వివిధ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల నాగ్ ఈ రియాలిటీ షో ను హోస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని టాక్.ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కొత్త హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ పేరు వినిపిస్తోంది. అన్‌స్టాపబుల్ షో తో ఎవరూ ఊహించని రీతిలో యాంకర్ గా సక్సెస్ అయిన బాలయ్య బిగ్ బాస్ 9వ సీజన్ ను హోస్ట్ చేయనున్నారని ఫిల్మ్ నగర్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇది నిజమైతే మాత్రం బిగ్ బాస్ షో, దాని టీఆర్పీలు నెక్ట్స్ లెవెల్ కు వెళ్లడం ఖాయం.