Responsive Header with Date and Time

నానీ సమస్య గుండె ఆపరేషన్ కాదా..?

Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-01 10:37:32


నానీ సమస్య గుండె ఆపరేషన్ కాదా..?

తెలుగు వెబ్ మీడియా న్యూస్:- మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలు, నాయకులు అసలు నానికి ఏమైంది అంటూ ఆరా తీసే పనిలో పడ్డారు. కొడాలి నానికి గతంలోనే ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల ఆయనకు గుండెలో సమస్య ఉన్నట్లు తేల్చారు. త్వరలో ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అని హైదరాబాదులోని ఓ ప్రముఖ ఆసుపత్రి తేల్చి చెప్పింది. దీనితో కొడాలి నాని త్వరలోనే ఆపరేషన్ చేయించుకుంటారు అనే ప్రచారం జరిగింది.ఇక సడన్ గా ఆయనను ప్రత్యేక విమానంలో ముంబై తరలించడం ఆశ్చర్యం కలిగించింది. ముంబై లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి చెందిన ప్రైవేటు విమానంలో ఆయనను కుటుంబ సభ్యులు ముంబై తీసుకెళ్లారు. దీనితో అసలు నానికి ఏమైంది అనే దాని పైన ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఆయనకు గుండె సమస్య అయితే.. కచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యాధునిక వసతులు కలిగిన ఆసుపత్రులు ఉన్నాయి. అలాగే ప్రముఖ వైద్యులు కూడా ఉన్నారు.


విజయవాడలోనే గుండెకు సమర్థవంతంగా చికిత్స చేసే వైద్యులు ఉన్నారు. రమేష్ ఆసుపత్రి గుండె ఆపరేషన్లకు ప్రసిద్ధి చెందింది. అయినా సరే కొడాలి నాని ముంబై వెళ్లాల్సిన అవసరం ఏంటి అనేదానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల తో పాటుగా మీడియాలో కూడా పెద్ద చర్చలు జరుగుతున్నాయి. కొడాలి నానికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, అవి తీవ్రం కావడంతోనే ఆయనను ముంబై తరలించారు అని కొంతమంది అంటున్నారు.


గతంలో కూడా నాని ఆరోగ్య పరిస్థితి గురించి మీడియాలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన కొట్టి పారేశారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో కూడా నాని ఒక సందర్భంలో కనిపించారు. మద్యపానం, గుట్కా వంటి అలవాట్లు ఉన్న నాని.. ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారా అనేదే ఇప్పుడు ప్రధాన చర్చ. అందుకే ఆయనను అక్కడికి తరలించి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


 

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: