Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-03-31 11:04:15
తెలుగు వెబ్ మీడియా న్యూస్:కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నిజమైన ఆహారభద్రత కల్పించిందని మంత్రి ఉత్తమ్కుమారెడ్డి పేర్కొన్నారు. హుజూరనగర్ సభలో ఆయన మాట్లాడుతూ.. “ప్రభుత్వం రూ.10,665 కోట్లు ఖర్చు చేసి 2.85 కోట్ల మంది లబ్దిదారులకు దొడ్డు బియ్యం ఉచితంగా ఇస్తుంటే వారు వాటిని తినలేక రూ.10లకు రైస్ మిల్లర్లకు, పౌల్ట్రీ ఫాంలు, బీర్లు తయారు చేసే సంస్థలకు విక్రయిస్తున్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయి.
మిల్లర్లు ఇదే బియ్యాన్ని రీసైకిల్ చేసి ప్రభుత్వానికి అప్పగించి రూ. కోట్ల అక్రమార్జన చేశారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని గతంలో ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లోనూ ప్రస్తావించా. గత ప్రభుత్వాలు మార్పు చేసేందుకు ప్రయత్నించలేదు. ఎన్నికల సమయంలోనే సీఎం రేవంత్తో కలిసి దొడ్డుబియ్యం స్థానంలో సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించి చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. భారాస ప్రభుత్వం ఉపఎన్నికలు జరిగిన చోటే రేషన్కార్డులు ఇచ్చింది. మా ప్రభుత్వం పేదలందరికి రేషన్కార్డులను అందిస్తోంది\' అని పేర్కొన్నారు.
• రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రతినెలా 90.42 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డుబియ్యాన్ని 2.85 కోట్ల మంది రేషన్కార్డుదారులకు అందించామని తెలిపారు. ఏప్రిల్ ఒకటి నుంచి రూ.2,858 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల మందికి ఉచితంగా ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేయనున్నామని వెల్లడించారు. గత ఖరీఫ్లో రాష్ట్రంలో 24 లక్షల టన్నుల సన్నధాన్యం పండిస్తే రూ.1200 కోట్ల బోనస్ చెల్లించామని పేర్కొన్నారు.