Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-02 10:32:44
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో ఎన్నో సినిమాలు, సిరీస్ లు చేసి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న అమలాపాల్న టిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో రాణిస్తోంది. అమలాపాల్ ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన కెరీర్లో ఎదుర్కొన్న సవాళ్లు, పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్ గురించి రీసెంట్ గా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తనకేమీ తెలియదని, ఏ విషయంపైనా ఎలాంటి అవగాహన లేదని చెప్తోంది. లైఫ్ లో ఎదురైన ఎదురుదెబ్బల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా అని చెప్తున్న అమలాపాల్ తన కెరీర్ మొదట్లో చేసిన సింధు సమవేలి సినిమా వల్ల చాలా వ్యతిరేకతను మూట గట్టుకుంది. తండ్రి వయసుతో ఉన్న మామతో అక్రమ సంబంధం పెట్టుకునే కోడలి పాత్రలో అమలాపాల్ ఆ మూవీలో కనిపించింది.ఆ సినిమా చూశాక తనపై ఎంతో వ్యతిరేకత వచ్చిందని, అది చూసి ఎంతో భయపడ్డానని చెప్పిన అమలాపాల్, ఆ సినిమా చూశాక తన తండ్రి చాలా బాధ పడ్డారని తెలిపింది. సింధు సమవేలి చేస్తున్నప్పుడు తన వయసు 17 ఏళ్లే అవడంతో ఆ పాత్ర సమాజంపై ఎలాంటి ముద్ర వేస్తుంది, ఆడియన్స్ తన పాత్రను ఒప్పుకుంటారా లేదా అనేది తనకు అర్థమవలేదని, సినిమా రిలీజయ్యాకే తనకు అన్నీ అర్థమయ్యాయని, డైరెక్టర్ చెప్పింది గుడ్డిగా ఫాలో అవడం వల్లే కెరీర్ మొదట్లో తాను చాలా ఇబ్బందులు పడ్డట్టు చెప్పుకొచ్చింది అమలాపాల్.