Category : నేర | Sub Category : జాతీయ Posted on 2025-04-02 10:33:08
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- వరుసగా జరుగుతున్న రైలు ప్రమాద ఘటనలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. నిన్నటికి నిన్న ఒడిశాలో ఓ రైలు పట్టాలు తప్పిన ఘటన మరువకుముందే.. తాజాగా జరిగిన మరో రైలు ప్రమాదం ముగ్గురిని బలితీసుకుంది. జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి..దాంతో ఒక్కసారిగా రైల్లో మంటలు చెలరేగి రెండు ఇంజిన్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో లోకో పైలెట్లు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈ ఘటనలో ముగ్గురు సీఐఎస్‌ఎఫ్ జవాన్లు సైతం గాయపడినట్టుగా తెలిసింది. ఈ ఘటన తెల్లవారు జామున 3.30 గంటలకు జరిగినట్లు సమాచారం.. ఫరక్కా నుంచి లాల్మాటియాకు వెళ్తున్న గూడ్స్ రైలు బర్హెట్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టినట్లుగా తెలిసింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీ మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.
ఇదిలా ఉంటే.. మార్చి 31 ఆదివారం కూడా ఒడిశాలో రైలు ప్రమాదం జరిగింది. కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. కటక్‌లోని నెర్గుండి రైల్వేస్టేషన్ సమీయంలో ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి రైలు నంబర్ 12251 అసోంలోని కామాఖ్య స్టేషన్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.