Category : క్రీడలు | Sub Category : జాతీయ Posted on 2025-04-02 11:45:43
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- ఒక కుర్రాడి దెబ్బకు లక్నో సూపర్ జియాంట్స్ బలైంది. టీమ్‌లో ప్లేస్ గ్యారెంటీ లేని ఆ కుర్ర బ్యాటర్.. ఫోర్లు, సిక్సుల వర్షంలో ఎల్‌ఎస్‌జీని ముంచేశాడు.
మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు బరిలోకి దింపుతారో లేదో గ్యారెంటీ లేదు. దీంతో బ్యాటింగ్, ఫీల్డింగ్ కోసం రెండు వేర్వేరు కిట్లు వాడే ఆ ఆటగాడు.. గ్రౌండ్‌కు ఒక్కటి మాత్రమే తీసుకొని వచ్చాడు. అయితే సడన్‌గా కోచ్ రికీ పాంటింగ్ పిలిచి టీమ్‌లోకి తీసుకున్నట్లు చెప్పగానే అతడు షాక్ అయ్యాడు. అయితే వెంటనే దాని నుంచి తేరుకొని గ్రౌండ్‌లోకి దిగాడు. ఛేజింగ్‌లో లక్నో సూపర్ జియాంట్స్‌కు చుక్కలు చూపించాడు. 25 బంతుల్లోనే 3 బౌండరీలు, 4 భారీ సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లకు పోయించాడు. అవతలి ఎండ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52 నాటౌట్) చెలరేగుతున్నా.. ఇతడు మాత్రం గేర్లు మారుస్తూనే ఉన్నాడు. మాస్ హిట్టింగ్‌తో మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేశాడు. అతడు మరెవరో కాదు.. నేహాల్ వధేరా.
ఆ టీమ్ వదిలేయడంతో..
పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన నేహాల్.. ఆడిన తొలి మ్యాచ్‌లోనే లక్నోపై విధ్వంసక నాక్‌తో గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దీంతో అంతా అతడి గురించి తెలుసుకునే పనిలో పడ్డారు. నేహాల్‌కు ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కాదు. ఇంతకముందు క్యాష్ రిచ్ లీగ్‌లో 7 మ్యాచులు ఆడాడతను. ముంబై ఇండియన్స్ తరఫున 2023 సీజన్‌లో పార్టిసిపేట్ చేశాడు. అయితే 2024 ఎడిషన్‌లో ఎంఐ టీమ్‌తోనే ఉన్నా అతడికి ఆడే చాన్స్ రాలేదు. ఆ తర్వాత అతడ్ని ఆ ఫ్రాంచైజీ వదిలేసింది.