Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-02 10:41:06
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- మల్లూవుడ్ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్దర్శకత్వంలో రీసెంట్ గా వచ్చిన సినిమా ఎల్2: ఎంపురాన్. లూసిఫర్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్ కూతురు అలంకృత మీనన్ సుకుమారన్ వర్క్ చేసి తన సత్తా చాటింది. అయితే ఎంపురాన్ లో అలంకృత నటించలేదు.ఎంపురాన్ బ్యాక్ గ్రౌండ్ కోసం అలంకృత పని చేసింది. ఆల్రెడీ మ్యూజిక్ నేర్చుకుంటూ తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకోవాలని చూస్తున్న పదేళ్ల అలంకృత ఎంపురాన్ మూవీ టైటిల్ ట్రాక్ మరియు మూవీలో ఎంపురానే అంటూ హమ్మింగ్ లా వచ్చే బీజీఎం కోసం పని చేసింది. ఈ విషయాన్ని స్వయంగా పృథ్వీరాజే వెల్లడించాడు. వాస్తవానికి ఆ వాయిస్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ దీపక్ దేవ్ ఓ ఓల్డ్ సింగర్ ను తీసుకుందామనుకున్నారట.కానీ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ కు పిల్లల గొంతు ఉండాలని పృథ్వీరాజ్ చెప్పడంతో అలంకృతను తీసుకున్నామని, కేవలం 5 నిమిషాల్లోనే అలంకృత దాన్ని రికార్డు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిందని ప్రశంసించారు. అలంకృత పదేళ్ల వయసులోనే ఇంత టాలెంటెడ్ గా ఉంటే ఇక పెద్దయ్యాక భవిష్యత్తులో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.