Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-03-31 10:53:58
తెలుగు వెబ్ మీడియా న్యూస్:ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గవర్నర్కు జ్ఞాపిక అందజేసి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ విడిగా సుమారు 15 నిమిషాలకు పైగా చర్చించారు. ఇందులో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై మాట్లాడినట్లు తెలిసింది. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశాలున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతుండడంతో దీనికి సంబంధించిన ఏర్పాట్లపై గవర్నర్తో జరిపిన చర్చల్లో ప్రస్తావించినట్లు సమాచారం. పలు పథకాల అమలు గురించి గవర్నర్కు ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిసింది.