Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-03-31 10:52:13
తెలుగు వెబ్ మీడియా న్యూస్:-గ్లోబల్ స్టార్ రామ్ చరణ్హై లీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది\' జాతీయ అవార్డు గ్రహీత, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజున విడుదల చేసిన టైటిల్, రెండు అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్లు గొప్ప ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ పై గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.ఉగాది సందర్భంగా, మేకర్స్ బిగ్ అప్‌డేట్‌తో చ్చారు. ఈ చిత్రం యొక్క మొదటి షాట్‌ను శ్రీరామ నవమికి ఏప్రిల్ 6న విడుదల చేయనున్నారు. రామ్ చరణ్ జనసమూహం మధ్య గాలిలోకి దూకుతూ కనిపించిన అనౌన్స్మెంట్ పోస్టర్ ఇంటెన్స్ మూమెంట్ ని ప్రజెంట్ చేస్తోంది. ఫస్ట్ షాట్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుందని హామీ ఇస్తోంది.
రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం కంప్లీట్ గా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. రగ్గడ్, రస్టిక్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.ఈ చిత్రంలో జాన్వి కపూర్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి అవార్డ్ విన్నింగ్ టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు ఐఎస్‌సి డీవోపిగా వర్క్ చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా పని చేస్తున్నారు.