Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-03-31 10:48:51
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 6 పరుగుల తేడాతో చెన్నై ఓడిపోయింది. ఈ సీజన్‌లో రాజస్థాన్ తొలి విజయం సాధించగా, చెన్నైకి ఇది రెండో ఓటమి.
గౌహతిలో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. రవీంద్ర జడేజా 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఎంఎస్ ధోని 11 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 63 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. వనిందు హసరంగా 4 వికెట్లు పడగొట్టాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. నితీష్ రాణా 36 బంతుల్లో 81 పరుగులు చేశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 37 పరుగులు చేశాడు. ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మతీష్ పతిరానా తలా 2 వికెట్లు పడగొట్టారు.