Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-03-31 10:44:33
తెలుగు వెబ్ మీడియా న్యూస్:-మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందుకే బయట ఏదైనా ఈవెంట్లు, పార్టీలు ఉంటే వాటికి నమ్రత, సితార వెళ్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సితార తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఓ జ్యుయలరీ షాపు కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ కు నమ్రతతో కలిసి వెళ్లి షాప్ ఓపెనింగ్ అనంతరం మీడియాతో ముచ్చటించింది.ఈ సందర్భంగా మహేష్ బాబు ఎప్పుడైనా ఏదైనా గోల్డ్ కానీ, నార్మల్ గిఫ్ట్ కానీ ఇచ్చారా అని నమ్రతకు ఓ రిపోర్టర్ నుంచి ప్రశ్న ఎదురవగా, మహేష్ కు అసలు గిప్టులు ఇచ్చే కాన్సెప్ట్ తెలియదని, ఇప్పటివరకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదని, సితార- తను మాత్రం ఒకరికొకరం గిఫ్టులు ఇచ్చుకుంటూ ఉంటామని ఈ సందర్భంగా నమత్ర తెలిపింది.తన పేరుపై కొత్త కలెక్షన్స్ ను ఇంట్రడ్యూస్ చేయడం ఎంతో ఆనందాన్నిస్తుందని చెప్పిన సితార త్వరలోనే తన తండ్రితో కలిసి ఈ బ్రాండ్ కోసం ఓ యాడ్ ను చేయబోతున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎంబీ29 గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారా అని అడిగితే సైలెన్స్ ఈజ్ ది బెస్ట్ పాలసీ అంటూ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తెలివిగా తప్పించుకుంది సితార.