Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-03-31 10:39:14
తెలుగు వెబ్ మీడియా న్యూస్:-ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చలామణి అయి ఎన్నో సినిమాలు చేసిన సుహాసిని ఇప్పుడు తల్లి రోల్స్ లో నటిస్తూనే మరోవైపు తన భర్త మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఇటీవల సుహాసిని ఓ ఇంటర్వ్యూలో తాను టీబీ వ్యాధితో బాధపడుతున్నట్టు వెల్లడించింది.విషయం బయటకు తెలిస్తే తన పరువు పోతుందేమోననే భయంతో ఎక్కడా చెప్పలేదని సుహాసిని తెలిపింది. తన సమస్యను రహస్యంగా ఉంచి, ఎవరికీ తెలియకుండానే ఆరు నెలల పాటూ టీబీకి చికిత్స తీసుకున్నానని చెప్పిన ఆమె, కొంత సమయం తర్వాత విషయం అందరికీ చెప్పి, టీబీ గురించి అందరికీ అవగాహన కల్పించాలనుకున్నట్టు తెలిపింది.తన హెల్త్ ఇష్యూని బయటపెట్టిన తర్వాత ఆమె ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండమని కోరుతూ మెసెజ్‌లు పెడుతుంటే, మరికొందరు మాత్రం అందరికీ సమస్యలున్నాయి, ఆ విషయంలో ఎందుకు పరువు పోతుందని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి సుహాసిని టీబీ నుంచి బయటపడటంతో ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు.