Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-03-31 10:22:05
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- నా జీవితాంతం సమాజం కోసం పనిచేయాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్నాను. చివరి వరకు ప్రజల కోసమే పనిచేస్తాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనూ, కృష్ణాజిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆదివారం నిర్వహించిన ఉగాది సంబరాల్లోనూ ఆయన పాల్గొని, మాట్లాడారు. పండుగలు మన దేశ సంస్కృతిలో ఒక భాగం. అవి మన వారసత్వం. పండుగ అంటే స్వీట్లే కాకుండా.. అన్ని రకాల సమస్యలూ ఉంటాయి. వీటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను సమాజం, కుటుంబ వ్యవస్థలు మనకు ఇచ్చాయి. వికసిత్ భారత్ ద్వారా 2047 నాటికి ప్రపంచంలోకెల్లా నంబర్ 1, 2 స్థానాల్లో భారతదేశం ఉంటుంది. ఇప్పుడు నేను వేసే పునాది ప్రపంచంలోనే తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెడుతుంది అని చంద్రబాబు పేర్కొన్నారు.