Category : | Sub Category : బ్రేకింగ్ వార్తలు Posted on 2024-07-31 09:30:36
TWM NEWS:గాజా: పాలస్తీనా ప్రాంతాన్ని పోలియో మహమ్మారి ప్రాంతంగా గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇజ్రాయెల్ సైనిక చర్య వల్ల ఇక్కడ ఆరోగ్య మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని.. ఈ పరిస్థితులు వైరస్ పునరుజ్జీవానికి దారి తీశాయని ఆరోపించింది.
దక్షిణ ఖాన్ యూనిస్ ప్రాంతంలో సేకరించిన మురుగు నీటి నమూనాల్లో CPV2 రకం కనిపించిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఏవైనా పోలియో కేసులు నమోదయ్యాయా అనే వివరాలను వెల్లడించలేదు. అయితే వైరస్ ఉనికి.. గాజా స్ట్రిప్ సహా పొరుగు దేశాల్లోని నివాసితులకు ఆరోగ్య ముప్పు. ప్రపంచ పోలియో నిర్మూలన కార్యక్రమానికి ఎదురుదెబ్బ అని పేర్కొంది.