Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-07-30 17:36:21
TWM News:-పెళ్లంటే ఆకాశమంత.. పందిరి, భూదేవంత పీటలు వేసి, కోట్లు కుమ్మరించి.. విందు, చుట్టాలు, వేలాది మందికి భోజనాలు, అంగరంగ వైభవంగా జరిపించాలని కలలు కంటుంటారు. ఇటీవల అంబానీల ఇంట పెళ్లి ఈ వర్ణనకు తగ్గట్టు జామ్‌జామ్‌గా జరిగింది. అయితే తాజాగా ఓ జంట ఇంతకు మించి అన్నట్లు వినూత్నంగా ఆలోచించారు. తమ పెళ్లికి ఏకంగా ఐఫోన్లలో వెడ్డింగ్ కార్డ్‌లు పంచారు. అదేంటీ అనుకుంటున్నారా? అవును..
విశాఖపట్నం, జులై 30: పెళ్లంటే ఆకాశమంత.. పందిరి, భూదేవంత పీటలు వేసి, కోట్లు కుమ్మరించి.. విందు, చుట్టాలు, వేలాది మందికి భోజనాలు, అంగరంగ వైభవంగా జరిపించాలని కలలు కంటుంటారు. ఇటీవల అంబానీల ఇంట పెళ్లి ఈ వర్ణనకు తగ్గట్టు జామ్‌జామ్‌గా జరిగింది. అయితే తాజాగా ఓ జంట ఇంతకు మించి అన్నట్లు వినూత్నంగా ఆలోచించారు. తమ పెళ్లికి ఏకంగా ఐఫోన్లలో వెడ్డింగ్ కార్డ్‌లు పంచారు. అదేంటీ అనుకుంటున్నారా? అవును.. ఈ జంట తమ పెళ్లికి రావాలని అయినవాళ్లందరికీ ప్రత్యేకంగా ఐఫోన్లను పంచి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇవి నిజంగా ఐఫోన్లు కాదండోయ్.. వీటిని ఓపెన్ చేస్తే వధూవరుల వివాహ ఆహ్వానం బలేగా చూపించారులే. ఇదెక్కడో విదేశాల్లోనో.. ఉత్తరాదిలోనో జరిగి ఉంటుందిలే అనుకుంటున్నారా? అస్సలు కాదు.. మన తెలుగు వాళ్ల క్రియేటివిటీలనే. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
వెడ్డింగ్ కార్డు కేవలం ఆహ్వానం మాత్రమే కాదు. ఇది దంపతుల అభిరుచికి ప్రతిబింబం. ఇటీవల జరుగుతున్న పెళ్లిళ్లలో కొందరు తమ అభిరుచికి తగ్గట్టు వెరైటీగా కార్డులను డిజైన్ చేసుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వైజాగ్‌కు చెందని ఎ జంట ఐఫోన్ నేపథ్యంతో ప్రత్యేకంగా వివాహ ఆహ్వాన పత్రికను రూపొందిచారు. ఇందుకు సంబంధించిన వీడియోను లక్ష్మణ్ వెడ్డింగ్ కార్డ్స్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.