Category : | Sub Category : క్రీడా Posted on 2024-07-30 15:06:49
పారిస్ ఒలింపిక్స్ లో.. భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది
TWM News: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సరబ్ జ్యోత్ సింగ్, మను బాకర్ జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మను బాకర్ జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా ద్వయం (లీ-యెజిన్) 10 పాయింట్లు సాధించింది. మను ఇప్పటికే వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో స్వాతంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్ గా ఆమె రికార్డు సృష్టించింది. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు 1900 ఒలింపిక్స్ లో బ్రిటీష్-ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్అ థ్లెటిక్స్ లోరెండు రజత పతకాలు సాధించాడు.