Responsive Header with Date and Time

కొండపై కనిపించిన అరుదైన అద్భుతం.. వెలికితీయగా కళ్లు జిగేల్

Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-07-30 12:40:00


కొండపై కనిపించిన అరుదైన అద్భుతం.. వెలికితీయగా కళ్లు జిగేల్

TWM News:-చారిత్రిక నేపధ్యం ఉన్న గుంటూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో.. ఇటీవలకాలంలో అనేక చారిత్రిక ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా కొండపై చెక్కిన పురాతన శాసనాన్ని ఔత్సాహిక పరిశోధకులు కనుగొన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం..

చారిత్రిక నేపధ్యం ఉన్న గుంటూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో.. ఇటీవలకాలంలో అనేక చారిత్రిక ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా కొండపై చెక్కిన పురాతన శాసనాన్ని ఔత్సాహిక పరిశోధకులు కనుగొన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామంపై కారుణ్య ఆశ్రమ నిర్వాహకుడు అల్లం ఇన్నారెడ్డి పుస్తకాన్ని రచించారు. ఇందులో అనేక చారిత్రిక అంశాలను ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఔత్సాహిక పరిశోధకులైన శ్రీనాధ్ రెడ్డి, శివశంకర్ గ్రామం చుట్టుపక్కల ఉన్న చరిత్ర ఆనవాళ్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే పాటిబండ్ల కొండపై ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయం ప్రవేశ ద్వారం పక్కనే ఒక శాసనం ఉండటాన్ని గమనించారు. దాన్ని పరిశోధించగా క్రీ.శ.17-18 శతాబ్ధం నాటి శాసనంగా గుర్తించారు. ఈ శాసనంలో గోపాపాత్రుడి కొడుకు కొండముడు అనే వ్యక్తి గుర్రాన్ని కొండ పడమటి దిక్కు వైపు నుండి ఎక్కించి తూర్పు దిశగా దిగేవారని ఉన్నట్లు వారు తెలిపారు. ఈ శాసనంతో పాటు క్రీస్తు పూర్వం 2000 ఏళ్ల నాటి రాతి పనిముట్లు, 14,16వ శతాబ్దాలకు చెందిన మహిషాసుర మర్దని, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. అవన్నీ కూడా చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లేనని వీటిని భద్రపర్చాల్సిన అవసరం ఉందని పరిశోధకులు తెలిపారు.


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: