శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం.. 5 గేట్లు ఎత్తి నీటి విడుదల
Category : |
Sub Category : తాజా వార్తలు Posted on 2024-07-30 12:25:35
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మంగళవారం మరో 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
శ్రీశైలం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. సోమవారం 3 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు.. తాజాగా మరో రెండు గేట్లను ఎత్తారు. దీంతో మొత్తం 5 గేట్ల ద్వారా నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్ వైపు ప్రవహిస్తోంది. మరోవైపు ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు.
శ్రీశైలం జలాశయం స్పిల్ వే ద్వారా 1.35 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్ల 4.27 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్లో 2.21 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.7 అడుగులు ఉంది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 202.9 టీఎంసీలుగా నమోదైంది.