Category : | Sub Category : రాజకీయం Posted on 2024-07-30 12:03:44
వాహన రద్దీ ఎక్కువగా ఉండి, 50 కి. మీ. పైగా దూరం ఉండే 26 రోడ్లను ఇంజినీర్లు ఎంపిక చేశారు. ఇవన్నీ కలిపి దాదాపు 1,600 కి. మీ. మేరకు ఉన్నాయి. వీటిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నారు. కచ్చితంగా ఎంత ట్రాఫిక్ రద్దీ ఉంది, వాటిలో కార్లు, లారీలు, బస్సులు వంటి వాహనాలు నిత్యం సగటున ఎన్ని ప్రయాణిస్తున్నాయి, ఆయా రహదారుల విస్తరణకు ఎంత వ్యయమవుతుంది.. తదితరాలన్నింటిపై డీపీఆర్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందుకు సలహా సంస్థను ఎంపిక చేయాలని భావిస్తున్నారు.
వాహన రద్దీ అధికంగా ఉన్న రాష్ట్రరహదారుల (ఎస్చ్) విస్తరణ, పునరుద్ధరణ (రెన్యువల్)పై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో విస్తరించడంపై కసరత్తు చేస్తోంది. ఇటీవల రహదారులు, భవనాల శాఖ (ఆర్అండ్)పై సీఎం
వద్ద జరిగిన సమీక్షలో.. రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. దీంతో అధికారులు వీటిపై పలు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు. ముఖ్యంగా వాహన రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్లను ఎంపికచేసి, వాటిని 7-10 మీటర్ల మేర విస్తరించేందుకు
ప్రతిపాదిస్తున్నారు. టెండర్లు పిలిచి, గుత్తేదారులకు ఆయా రహదారుల విస్తరణతోపాటు కొంతకాలం నిర్వహణ కూడా అప్పగించనున్నారు. ఇందుకయ్యే వ్యయాన్ని గుత్తేదారు టోల్ రూపంలో వసూలు చేసుకునేందుకు వీలుకల్పించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఒకవేళ విస్తరణకు అయ్యే వ్యయం మేరకు టోల్ వచ్చే అవకాశం లేకపోతే.. ఆ మిగిలిన మొత్తాన్ని వయబులిటీగ్యాప్ ఫండ్ రూపంలో ప్రభుత్వం సర్దుబాటు చేసేలా చూడాలని భావిస్తున్నారు.