Responsive Header with Date and Time

అంతుపట్టని ఆపరేషన్ గరుడ గమనం....

Category : | Sub Category : నేర Posted on 2024-07-30 10:38:06


అంతుపట్టని ఆపరేషన్ గరుడ గమనం....

విశాఖ డ్రగ్స్ కంటెయినర్ కేసులో పురోగతి ఏదీ? సీబీఐ ప్రయోగశాలలకు నమూనాలు బయటకు రాని నివేదికలు


TWM News: సార్వత్రిక ఎన్నికల వేళ విశాఖ తీరంలో డ్రగ్స్ కంటెయినర్ రేపిన కలకలం అంతాఇంతా కాదు. డ్రైడ్ ఈస్ట్ మాటున డ్రగ్స్ దిగుమతి కావడం అప్పట్లో సంచలనమైంది. ఈస్ట్ బ్యాగ్లలో ఎంతమేర డ్రగ్స్ కలిశాయో తెలుసుకోవడానికి నమూనాలు సేకరించారు. వాటిని సీబీఐకి చెందిన ప్రయోగశాలలకు పంపి నాలుగు నెలలవుతోంది. ఇప్పటికీ నివేదికలు బయటకు రాలేదు. ఢిల్లీ కేంద్రంగా సీబీఐ దర్యాప్తు చేస్తుండటంతో కేసులో పురోగతి ఏమిటనేది ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ సాగుతోంది.

విశాఖకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్సపోర్ట్స్  ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆర్డర్ పెట్టగా బ్రెజిల్ నుంచి 25 వేల కిలోల ఇన్ యాక్టీవ్ డ్రైడ్ ఈస్ట్ ఈ ఏడాది మార్చి 16న పోర్టుకు చేరింది. ఇంటర్పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడ పేరుతో ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు కంటెయినర్ ను తెరిచి బ్యాగ్లను పరిశీలించారు. నిషేధిత మాదకద్రవ్యాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ తర్వాత బ్యాగ్లలో ఎంత శాతం డ్రగ్స్ కలిశాయో తెలుసుకునేందుకు నమూనాలు సేకరించి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. ఈస్ట్ బ్యాగ్లను వేరే కంటెయినర్లోకి మార్చి సీల్ వేశారు. సాక్ష్యాల సేకరణ, దిగుమతిదారుల వాంగ్మూలం నమోదు తర్వాత సీబీఐ అధికారులు ఢిల్లీ వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆపరేషన్ గరుడ కేసును అక్కడి నుంచే దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ బృందం బ్రెజిల్ వెళ్లినట్లు తెలుస్తోంది. నగదు లావాదేవీలు, కస్టమ్స్ ను తప్పించుకుని బ్రెజిల్ నుంచి నౌక ఎలా వచ్చింది? వంటివాటిపై ఆరా తీసి ఏం తేల్చారనేదీ బయటకు రాలేదు. 

వీటీసీపీఎల్ ఎగ్జామిన్ పాయింట్లోనే...

సీబీఐ సీజ్ చేసిన కంటెయినర్ విశాఖ కంటెయినర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీటీసీపీఎల్) ఎగ్జామిన్ పాయింట్లోనే ఇంకా ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) భద్రత కల్పిస్తోంది. డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీ అర్ ఐ ) సీజ్ చేసిన కంటెయినర్లు పది వరకు ఏడెనిమిదేళ్లుగా అక్కడే పడిఉన్నాయి. డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్లు భావిస్తున్న డ్రైడ్ ఈస్ట్ కంటెయినరూ అలాగే మరుగున పడిపోతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ రవాణాకు సంబంధించి... సంధ్యా ఆక్వా ఎక్సపోర్ట్స్ తో పాటు, పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. విశాఖను వదిలి వెళ్లకూడదంటూ ఆదేశాలిచ్చింది. సంధ్యా ఆక్వా యాజమాన్యం, వైకాపా నేతల మధ్య సంబంధాలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.

Search
Categories
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: