Category : | Sub Category : క్రీడా Posted on 2024-07-30 10:06:00
సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు తాత్కాలిక కెప్టెన్ మాత్రమే అని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ తో పొట్టి ఫార్మాట్ కు రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు. దీంతో భవిష్యత్ లో టీ20ల్లో టీమిండియా కెప్టెన్ గ ఎవరు ఉంటారనే దానిపై చర్చ జరిగింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్కు శుభ్మన్ గిల్ను కెప్టెన్ గ ఎంపిక చేశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా శ్రీలంక పర్యటనలో ఉంది. ఈ టూర్తోనే గౌతమ్ గంభీర్ భారత కోచ్ గ తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ కు సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గ నియమించారు. శ్రీలంక పర్యటన కోసం టీ20లు, వన్డేల్లో శుభ్మన్ గిల్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ అంశంపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ మాట్లాడాడు. సూర్యకుమార్ యాదవ్ను తాత్కాలిక కెప్టెన్గా మాత్రమే ఎంపిక చేశారని అభిప్రాయపడ్డాడు.
సూర్యకుమార్ ను తాత్కాలికంగా కెప్టెన్ గ నియమించారని భావిస్తున్నా. కోచ్ గంభీరకు ప్రస్తుతం భారత జట్టులో ఉన్న వారిలో కెప్టెన్సీకి సరైన ఆటగాడు కనిపించడం లేదు. దీర్ఘకాలిక కెప్టెన్గా ఎవరు ఉండాలనే దానిపై గంభీర్ దృష్టిసారించాడు. అందుకు శుభ్మన్ గిల్ సరైనోడని నా అభిప్రాయం. అతడు పదేళ్లపాటు భారత కెప్టెన్గా ఉండటానికి ఛాన్స్ ఉంది. కానీ, ఆ బాధ్యతలను స్వీకరించడానికి గిల్ ప్రస్తుతం సిద్ధంగా లేడు. కాబట్టి కాస్త ఎక్కువ అనుభవం ఉన్న ఆటగాడిని కెప్టెన్ చేయడం తెలివైన నిర్ణయమని భావిస్తున్నా. ఒకవేళ సూర్యకుమార్ కెప్టెన్గా రాణిస్తే అతడిని వచ్చే టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగించొచ్చు. తర్వాత శుభ్మన్ గిల్ లేదా కెప్టెన్సీ చేసే సత్తా ఉన్న మరే ఆటగాడికైనా సారథ్య బాధ్యతలు అప్పగిస్తారు. నిజంగా ఇది చాలా మంచి నిర్ణయం అని స్కాట్ స్టైరిస్ పేర్కొన్నాడు.