Category : | Sub Category : బ్రేకింగ్ వార్తలు Posted on 2024-07-30 08:44:51
TWM NEWS:దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాలో అధ్యక్షుడు నికోలస్ మడురో మరోసారి విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు 51.20 శాతం, ఆయన ప్రధాన ప్రత్యర్థి ఎడ్మండో గొంజాలెజ్కి 44.02 శాతం ఓట్లు చొప్పున లభించాయని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
కారకస్: దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాలో అధ్యక్షుడు నికోలస్ మడురో మరోసారి విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు 51.20 శాతం, ఆయన ప్రధాన ప్రత్యర్థి ఎడ్మండో గొంజాలెజ్కి 44.02 శాతం ఓట్లు చొప్పున లభించాయని ఎన్నికల అధికారులు
ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 30 వేల పోలింగ్ కేంద్రాలవారీగా ఫలితాలను అధికారులు వెంటనే ప్రకటించకపోవడంతో.. భారీగా అవకతవకలు జరిగాయంటూ విపక్షం ఆరోపిస్తోంది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపింది. ప్రతిపక్షాలన్నీ తమ అభ్యర్థి గొంజాలెజ్కు మద్దతుగా ఏకమయ్యాయి. ఒపీనియన్ పోల్స్లో మడురోపై గొంజాలెజ్కు స్పష్టమైన ఆధిక్యం లభించింది. అధికారికంగా పూర్తి వివరాలను వెనెజువెలా ఎన్నికల అధికారులు ప్రకటించకపోవడంతో మడురో విజయంపై విదేశీ నేతలు ఇంకా స్పందించలేదు. ఓటర్ల
మనోగతాన్ని ఫలితాలు ప్రతిబింబించకపోవడంపై తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు.