Responsive Header with Date and Time

ట్రంప్ ను ఢీకొనే సత్తా హారిస్కే ఉంది:సల్మాన్ రద్దీ స్పష్టీకరణ

Category : | Sub Category : బ్రేకింగ్ వార్తలు Posted on 2024-07-30 08:34:10


ట్రంప్ ను  ఢీకొనే సత్తా హారిస్కే ఉంది:సల్మాన్ రద్దీ  స్పష్టీకరణ

TWM NEWS:న్యూయార్క్: డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడేందుకు సిద్ధమవుతున్న కమలా హారిస్కు ప్రవాస భారతీయ రచయిత సల్మాన్ రద్దీ మద్దతు పలికారు. దేశాన్ని నిరంకుశంవైపు తీసుకెళ్లే ట్రంప్ను అడ్డుకోగలిగే సమర్థ నేత ఆమేనని స్పష్టం చేశారు. ఆదివారం న్యూయార్క్ లో జరిగిన  సౌత్ ఏషియన్ మెన్ ఫర్ అమెరికా  కార్యక్రమంలో రద్దీ మాట్లాడారు. ఇందులో భారతీయ అమెరికన్ ప్రముఖులైన చట్టసభ సభ్యులు, రచయితలు, పాలసీ నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, భారతీయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది క్లిష్ట సమయం. నేను ముంబయి నుంచి వచ్చినవాడిని. ఒక భారతీయ అమెరికన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకురావడం పట్ల గర్విస్తున్నా. నా భార్య కూడా ఆఫ్రో అమెరికనే. హారిస్ ఆఫ్రో ఇండియన్ అమెరికన్గా బరిలోకి దిగాలనుకోవడాన్ని సహజంగానే ఇష్టపడతాం అని రద్దీ పేర్కొన్నారు. అలా అని జాతుల ఆధారంగా మద్దతు ఇవ్వడం లేదని, దానికి ఉదాహరణ రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ సతీమణి ఉష భారతీయ అమెరికన్ అయినా ఆమెకు అండగా లేమని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. హారిస్ ఓడిపోతారనడానికి కారణాలేవీ లేవని, ఆమె విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

44 లక్షల మంది భారతీయ అమెరికన్ల ఆశాదీపం

వాషింగ్టన్: అమెరికాలోని 44 లక్షల మంది భారతీయ అమెరికన్ల ఆశాదీపం కమలా హారిస్ అని డెమోక్రటిక్ పార్టీ నిధుల సేకరణ కర్త అజయ్ భూటోరియా అభిప్రాయపడ్డారు. భారతీయ మూలాలున్న హారిస్కు అదనపు బలం వారేనని పేర్కొన్నారు. అమెరికా నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న ఈ సమయంలో హారిస్ ఆశాదీపంలా కనిపిస్తున్నారు. ఆమె అభ్యర్థిత్వం భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. ప్రతి ఒక్క అమెరికన్కు అవకాశాలను కల్పిస్తుంది  అని భూటోరియా పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: