Category : | Sub Category : జాతీయ Posted on 2024-07-29 17:41:40
TWM News:-ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొంత ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది. దాని గురించి అవగాహన పెంచుకుంటే పన్నును పొదుపు చేసుకోవచ్చు. వాటిలో ఫారం 15జీ, 15 హెచ్ చాలా ముఖ్యమైనవి. వీటి ద్వారా మీరు ఫిక్స్ డ్ డిపాజిట్ల పై ట్యాక్స్ డిడెక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్)ను పొదుపు చేసుకోవచ్చు.
ఆదాయం పెంచుకోవడానికి, భవిష్యత్తు అవసరాలకు ప్రతి ఒక్కరూ వివిధ మార్గాలలో పెట్టుబడులు పెడుతుంటారు. వాటి నుంచి రాబడి పొందుతూ ఉంటారు. అలా వచ్చిన ఆదాయం పరిమితికి మించి ఉంటే ఆదాయపు పన్ను చెల్లించాలి. ఇది దేశ పౌరులందరి బాధ్యత. అయితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొంత ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది. దాని గురించి అవగాహన పెంచుకుంటే పన్నును పొదుపు చేసుకోవచ్చు. వాటిలో ఫారం 15జీ, 15 హెచ్ చాలా ముఖ్యమైనవి. వీటి ద్వారా మీరు ఫిక్స్ డ్ డిపాజిట్ల పై ట్యాక్స్ డిడెక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్)ను పొదుపు చేసుకోవచ్చు.
ఫారాలు ఇవే..
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై టీడీఎస్ పొదుపు చేయాలనుకునేవారు 15జీ, 15 హెచ్ ఫారాలను బ్యాంకులకు స్వయంగా సమర్పించాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో మీ వడ్డీ ఆదాయం రూ. 40 వేలు దాటినప్పుడు బ్యాంకులు టీడీఎస్ ను తీసివేస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఏ ప్రకారం సీనియర్ సిటిజన్లకు ఈ వడ్డీ ఆదాయ పరిమితి రూ. 50 వేలు ఉంది. అయితే వివిధ బ్యాంకుల్లోని అన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి మీకు వచ్చే వడ్డీ ఆదాయాన్ని లెక్కిస్తారు. ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం పన్ను విధించదగిన పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పుడు 15జీ, 15 హెచ్ ఫారాలను బ్యాంకులకు అందజేయాలి. దాని ద్వారా మీ వడ్డీ ఆదాయంపై టీడీఎస్ తీసివేయవద్దని అభ్యర్థించవచ్చు. నిబంధనల ప్రకారం.. 60 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు ఫారం 15జీని, అంతకంటే ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్లు ఫారం 15హెచ్ ను అందజేయాల్సి ఉంటుంది.
ఫారమ్ 15జీని ఎవరు సమర్పించాలంటే..
60 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వ్యక్తులు, హెచ్ యూఎఫ్ లు, ట్రస్టులు, ఇతర మదింపుదారులు (కంపెనీలు లేదా సంస్థలను మినహాయించి). సమర్పించాలి.
మీ ఆదాయంపై లెక్కించిన పన్ను శున్నా అయినప్పుడు అందజేయాలి.
15 హెచ్ ఎవరు సమర్పించాలంటే..
60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులు లేదా సీనియర్ సిటిజన్ల అందజేయాలి.
వీరి ఆదాయం కూడా పన్ను విధించే పరిమితికి కంటే తక్కువగా ఉన్నప్పుడే సమర్పించాలి.
డౌన్ లోడ్ ఉచితం.. టీడీఎస్ భారాన్ని తగ్గించే రెండు ఫారాలనూ దేశంలోని అన్ని ప్రధాన బ్యాంకుల వెబ్ సైట్ నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ లోనూ ఇవి అందుబాటులో ఉంటాయి.