Category : |
Sub Category : సినిమా Posted on 2024-09-13 18:54:49
తెలుగు వెబ్ మీడియా న్యూస్: శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీకి వచ్చిన జాన్వీకపూర్ వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకున్నారు. అయితే ఈ అమ్మడు టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వడం వెనక ఓ స్టార్ దర్శకనిర్మాత ఉన్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ లో ఎంతో మంది నటీనటులు వారి కెరీర్ గురించి కరణ్ జోహర్ సలహాలు తీసుకుంటూ ఉంటారని టాక్. అలానే జాన్వీకు కూడా కరణ్ ఓ సూచన చేశారట. బీటౌన్ లో తొలి అవకాశం అందుకున్న తర్వాత జాన్వీకు తమిళ, తెలుగులో ఛాన్స్ లో వచ్చాయని దీంతో ఆమె కోలీవుడ్.. టాలీవుడ్లలో దేన్ని ఎంచుకోవాలో కరణ్ ను సలహా కోరినట్లు సమాచారం. ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తే తెలుగులో మంచి ఛాన్స్ లో వస్తాయని కరణ్ ఆమెతో చెప్పారట. దీంతో జాన్వీ వెంటనే దేవర ను ఓకే చేసేశారు. కరణ్ సలహా ఈ భామకు కలిసొచ్చినట్లే ఇక్కడ స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. ఎన్టీఆర్ సినిమా చేస్తుండగానే మెగా హీరో రామ్ చరణ్ సరసన ఛాన్స్ కొట్టేశారు. నానితో కూడా ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తల వస్తున్నాయి.
బీటౌన్ లో జాన్వీ ఇప్పటి వరకు చిన్న హీరోల సినిమాల్లోనే నటించారు. కానీ, తెలుగులో మాత్రం తొలి సినిమానే ఎన్టీఆర్ తో ఆడిపాడనున్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ కు పోటీ ఇవ్వలేని జాన్వీ.. ఇక్కడ మాత్రం టాప్ లిస్ట్ హీరోయిన్స్ కు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేవర లో ఇప్పటి వరకు రిలీజైన పాటల్లో జాన్వీ అందానికి, డ్యాన్స్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా రిలీజైన దావుదీ.. సాంగ్ లో ఎన్టీఆర్ తో సమానంగా డ్యాన్స్ వేసిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. దీంతో ఈ సినిమా విడుదలయ్యాక జాన్వీ మరిన్ని అవకాశాలు అందుకోవడం ఖాయమని వారు భావిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కతోన్న దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జాన్వీ తంగం పాత్రలో కనిపించనున్నారు. లంగా ఓణీతో పక్కా పల్లెటూరి అమ్మాయిగా అలరించనున్నారు. యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతోన్న ఈ చిత్రం రిలీజ్ కు ముందే పలు రికార్డులు తన ఖాతాలో వేసుకోవడం విశేషం.