Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-29 12:34:45
తెలుగు వెబ్ మీడియా న్యూస్:పదేళ్ల భారాస పాలన, 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చర్చకు మాజీ సీఎం కేసీఆర్ సిద్ధమా? ఎప్పుడు, ఎక్కడికి రమ్మన్నా వస్తాం.. మాతో చర్చించే దమ్ముందా\' అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసం పాలైందని.. తెలంగాణకు తొలి, చివరి విలన్ కేసీఆరే అని విమర్శించారు. గల్ఫ్ కార్మికులకు నకిలీ పాస్పోర్టులు ఇచ్చిన చరిత్ర ఉన్న ఆయనకు గాంధీ కుటుంబం గురించి మాట్లాడే స్థాయి లేదని మండిపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసిందని.. ఆయనను తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులతో కలిసి మహేశ్కుమార్ గౌడ్ సోమవారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. \'భారాస రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. కేసీఆర్ ప్రసంగంలో పసలేదు. కాంగ్రెస్ పథకాలతో మహిళలు సంతోషంగా ఉన్నారు. అందుకే, భారాస సభకు వాళ్లు వెళ్లలేదు. గాంధీ కుటుంబంపై విమర్శలు చేసినందుకు కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రసంగంలో ప్రధాని మోదీ, భాజపా గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. భాజపా, భారాస లోపాయికారీ ఒప్పందానికి ఇదే నిదర్శనం. కేసీఆర్.. కిషన్రెడ్డితో ములాఖత్ అయ్యి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు\' అని మహేశ్కుమార్డ్ విమర్శించారు. షబ్బీర్అలీ మాట్లాడుతూ భారాస ఎన్నికల మ్యానిఫెస్టోలపై చర్చించడానికి కేసీఆర్ రమ్మంటే ఫాంహౌస్కైనా వస్తామన్నారు.