Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-29 11:03:51
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామంలో తన అందచందాలతో, నటనతో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మృణాల్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఇటీవల ఒక అవార్డ్స్ వేడుక సందర్భంగా మృణాల్‌కు ఊహించని అవమానం జరిగిందంట.తాజాగా క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్స్ అవార్డ్స్ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు హీరోయిన్లు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ హాజరయ్యారు. ఈ ఫంక్షన్‌కు ఫస్ట్ మృణాల్ ఠాకూర్ హాజరవ్వగా అక్కడున్న మీడియా మొత్తం ఆమె చుట్టూ చేరి తన కొత్త ప్రాజెక్టుల గురించి ప్రశ్నించడం ప్రారంభించింది. ఇంతలో అక్కడికి జాన్వీ కపూర్ చేరుకోగా మృణాల్ దగ్గరున్న మీడియా మొత్తం ఆమెను వదిలేసి దేవర భామ దగ్గరకు పరిగెత్తారట.ఈ ఊహించని అవమానకర సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని మృణాల్ తన తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సంఘటనతో చాలా వేదనకు గురయ్యానని తెలిపింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ నటినటుల పిల్లలకున్న ప్రాధాన్యత తనలాంటి సాధారణ నటులకు దక్కదని మృణాల్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మృణాల్ వ్యాఖ్యలతో బాలీవుడ్‌లో స్టార్ నటుల వారసత్వం వల్ల ఇతరుల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.