Responsive Header with Date and Time

Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-09-13 17:50:54


TWM News:చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 30మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. శుక్రవారం(సెప్టెంబర్ 13) మధ్యాహ్నం బంగారుపాళ్యం మండలం మొగలి కనుమ రహదారిపై రెండు లారీలు, ఒక ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

      చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళుతున్న ఆర్టీసీ బస్సును పలమనేరు వైపు నుంచి ఐరన్‌ లోడుతో వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. అదే సమయంలో కనుమ రహదారిలో మితిమీరిన వేగంతో వస్తున్న లారీ అదుపుతప్పి పక్క రోడ్డులో ఎదురుగా వస్తున్న బస్సు పైకి దూసుకెళ్ళింది. ఘటనలో ఆర్డీసీ డ్రైవర్‍ తోపాటు 8 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పలమనేరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఐదుగురి పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ఇదిలావుంటే, మొగ‌లి కనుమ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం.. సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: