Category : | Sub Category : సినిమా Posted on 2024-09-13 17:37:14
తెలుగు వెబ్ మీడియా న్యూస్: పాన్ ఇండియా స్టార్ గా వరుస సినిమాలతో అలరిస్తున్నారు ప్రభాస్. ఇటీవల ఆయన నటించిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కృష్ణంరాజు నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ప్రభాస్.. రౌద్ర రసాన్ని పండించటంలోనూ ఆయనను తలపిస్తారు. వెండితెరపై అలాప్రభాస్ కు నిపించినప్పుడు సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రభాస్ కటౌట్ను సరిగ్గా వాడుకున్న దర్శకుల లో ఎస్.ఎస్.రాజమౌళి ఒకరు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి మంచి విజయాన్ని అందుకుంది. ఇక బాహుబలి సినిమాల గురించి, ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేశాయి.
సాధారణంగా ప్రభాస్ వేదికలపై పెద్దగా మాట్లాడరు. విలేకరుల సమావేశంలోనూ మైకు పట్టుకోవడానికి కూడా తటపటాయిస్తుంటారు. కెరీర్ తొలినాళ్లలో షూటింగ్ లోనూ ఇలాగే ఇబ్బంది పడేవారట. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి చిత్రీకరణలోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. బాజీరావును చంపేసిన తర్వాత ప్రభాస్ అతడి శవాన్ని ఈడ్చుకెళ్లి రాజకీయ నాయకుడైన అప్పలనాయుడు (కోట శ్రీనివాసరావు)కు వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి ప్రజల కోసం పోరాటం చేస్తానని చెబుతాడు. అయితే, అప్పుడు సెట్లో ప్రభాస్ డైలాగ్ లు చెప్పలేదట. కేవలం పెదవులు మాత్రమే కదిపారట.