Category : |
Sub Category : క్రీడా Posted on 2024-09-13 16:36:11
తెలుగు వెబ్ మీడియా న్యూస్: దులీప్ ట్రోఫీలో స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కు కలిసి రావడం లేదు. కెప్టెన్ గా ఉంటూ కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అతడు విఫలమవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఇలాగే ఆడితే భారత జట్టులోకి రావడం కష్టం అవుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నమాట. ప్రస్తుతం దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇండియా D కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (0) ఇండియా C బౌలర్ల దెబ్బకు డకౌట్ గా పెవిలియన్ కు చేరాడు. అనంతపురం వేదికగా ఈ మ్యాచ్లు జరుగుతుండటంతో అక్కడి ఎండ వేడిని తట్టుకోవడం క్రికెటర్లకు ఇబ్బందిగా మారింది. దీంతో బ్యాటింగ్ కు వచ్చే సమయంలో శ్రేయస్ సన్ గ్లాసెస్ ను పెట్టుకొని రావడం గమనార్హం. అయితే, ఏడు బంతులు ఎదుర్కొన్నప్పటికీ ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లోబౌలింగ్ లో ఆకిబ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చాడు.
సంజూ కూడా విఫలం..
దులీప్ ట్రోఫీలో సత్తా చాటితే జాతీయజట్టుకు ఆడే అవకాశం సులువుగా వస్తుంది. కానీ, ఈ సూత్రాన్ని అందుకోవడంలో సంజూ శాంసన్ విఫలమైనట్లు కనిపిస్తోంది. ఇండియా D తరఫున బరిలోకి దిగిన అతడు ఆరు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులే చేశాడు. ఇందులో ఒక ఫోర్ కూడా ఉంది. ఎక్కువ సమయం క్రీజ్ లో ఉండలేకపోయాడు. దీంతో అతడికి మద్దతుగా నిలిచే ఫ్యాన్స్ ను ఈ ప్రదర్శన ఇరకాటంలో పడేసింది. మరోవైపు ఇషాన్ కిషన్ సెంచరీ చేసి కదం తొక్కడంతో సంజూశాంసన్ తదుపరి ఇన్నింగ్స్ లో నైనా రాణించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సమయానికి ఇండియా D 86/4 స్కోరుతో కొనసాగుతోంది. క్రీజ్ లో దేవదత్ పడిక్కల్ (40), రికీ భుయ్ (22) ఉన్నారు. అంతకుముందు ఇండియా A తొలి ఇన్నింగ్స్ 290 పరుగులకు ఆలౌటైంది.
భారీ స్కోరు దిశగా ఇండియా C
దులీప్ ట్రోఫీ రెండోరోజు ఆట కొనసాగుతోంది. ఇండియా Bతో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా C భారీ స్కోరు దిశగా సాగుతోంది. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సమయానికి ఎనిమిది వికెట్ల నష్టానికి 483 పరుగులు చేసింది. క్రీజ్ లో మానవ్ సుతార్ (56), వైశాక్ కుమార్ (8) ఉన్నారు.