Category : | Sub Category : అంతర్జాతీయ Posted on 2024-09-13 16:22:15
TWM News:రతన్ టాటా.. ఈ పేరు అందరికి తెలిసిందే. తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటున్నారు. అలాగే ఐఫోన్.. ఈ ఫోన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఇప్పుడు రతన్ టాటా గురించి చెప్పి ఫోన్ గురించి ఎందుకు చెబుతున్నాననేగా మీ ప్రశ్న.. మరి రతన్ టాటా.. ఐఫోన్ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. పండుగల సందర్భంగా రతన్ టాటా భారీ బహుమతులు ఇవ్వనున్నారు. దీపావళి తర్వాత టాటా గ్రూప్ నుంచి భారీ ప్రకటన రానుంది. అప్పుడే దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి. రతన్ టాటా కంపెనీ ఈ ఉపాధి అవకాశాలను కల్పించనుంది. కనీసం 50 వేల ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.ఐఫోన్ 16 ఈ వారం మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఐఫోన్ విదేశాల నుంచి దిగుమతి అయ్యేది. అయితే ఈసారి ఐఫోన్ ఇండియాలోనే తయారవుతుంది. ఇక ఈ ఐఫోన్ తయారీ బాధ్యతను రతన్ టాటా సంస్థ దక్కించుకుంది. టాటా ఎలక్ట్రానిక్స్ ఐఫోన్ తయారీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారత్‌లో వచ్చే నవంబర్‌లో అంటే దీపావళి సందర్భంగా ఐఫోన్ల తయారీ ప్రారంభం కానుందని వినికిడి.