Category : | Sub Category : రాజకీయం Posted on 2024-09-13 15:56:46
తెలుగు వెబ్ మీడియా న్యూస్: శాంతి భద్రతల విషయంలో రాజీపడకూడదని డీజీపీ జితేందర్ అన్నారు. ఇటీవలి పరిణామాల దృష్ట్యా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణలో పరిస్థితులు దెబ్బతీసే వ్యక్తులపై జీరో టాలరెన్స్ తో వ్యవహరిస్తామన్నారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని హెచ్చరించారు. పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ, బీ అర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు బీ అర్ ఎస్ నేతలను పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్టు చేశారు.
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటివారైనా కఠినంగా వ్యవహరించాలని అంతకు సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ జితేందర్ కు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం పోలీసు యంత్రాంగంతో సమీక్షించాలని తెలిపారు.