Category : | Sub Category : సినిమా Posted on 2024-09-12 17:27:02
తెలుగు వెబ్ మీడియా న్యూస్: దేవర చూసేవరకు తనను బతికించాలని ఓ క్యాన్సర్ పేషెంట్ చివరి కోరిక కోరుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కౌశిక్ (19) కొంతకాలంగా బోన్ క్యాన్సర్ బాధపడుతున్నాడు. అతడు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో చనిపోయేలోపు దేవర (Devara) చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు తెలిపారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్ లో వారు మీడియా సమావేశం నిర్వహించారు. నా కుమారుడికి చిన్నప్పటినుంచి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం . ఇప్పుడు కూడా చివరి కోరికగా దేవర చూడాలని అడుగుతున్నాడు. సెప్టెంబర్ 27 వరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు. అది ఒక్కటే అతని ఆఖరి కోరిక అంటూ కౌశిక్ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమారుడి వైద్యానికి రూ.60లక్షలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని ఆమె కోరారు. ఈ వీడియోను షేర్ చేస్తున్న తారక్ అభిమానులు ఆయన్ని ట్యాగ్ చేస్తున్నారు. తనని ప్రేమించే అభిమానులన్నా, వారి కుటుంబసభ్యులన్నా ఎంతో ఆప్యాయత కనబరుస్తుంటారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR). గతేడాది ఓ అభిమాని తన తల్లికి ఆయనంటే ఎంతో ఇష్టమని చెప్పగా.. తారక్ ఆమెతో స్వయంగా ఫోన్లో మాట్లాడి ఆ అభిమాని కోరిక తీర్చారు.