Category : | Sub Category : బ్రేకింగ్ న్యూస్ Posted on 2024-09-12 17:19:44
TWM News:వాహనదారులకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్ అందించనుంది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో భారత్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సంకేతాలు ఇచ్చారు. ఇటీవల మీడియాతో ముచ్చటించిన ఆయన.. చమురు కంపెనీలపై విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తొలగించే ప్రతిపాదనను కేంద్రం సమీక్షిస్తోందని వెల్లడించారు.