Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-09-12 15:44:56
తెలుగు వెబ్ మీడియా న్యూస్; కళ్లెదుటే తమ కష్టం కొట్టుకుపోయిందని కృష్ణాజిల్లా వరద బాధితులు కేంద్రబృందానికి మొరపెట్టుకున్నారు.వరదలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు కేంద్రబృందం బుధవారం కృష్ణాజిల్లాలో పర్యటించింది. పెనమలూరు మండలంలోని యనమలకుదురు, చోడవరం, పెదపులిపాక గ్రామాలతో పాటు కంకిపాడు మండలం మద్దూరులో దెబ్బతిన్న పంటలను, ఇళ్లను పరిశీలించారు.సాగు మొదలుపెట్టిన రెండు నెలలకే పంటలన్నీ కొట్టుకుపోయాయని పెనమలూరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు యనమలకుదురు, పెదపులిపాకలలో ఇళ్లు మునిగిపోయిన బాధితులతో బృందసభ్యులు మాట్లాడారు. కంకిపాడు మండలం మద్దూరులోని ముంపుప్రాంతాన్ని కేంద్రబృందం సభ్యులు సందర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వరద నష్టంపై ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. కృష్ణానదికి కనీవినీ ఎరుగని వరద వచ్చి రూ.1085.46 కోట్ల నష్టం సంభవించినట్లు కేంద్ర బృందానికి బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి వివరించారు. బాపట్ల జిల్లా వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో కేంద్ర బృందం పర్యటించింది.