Responsive Header with Date and Time

తండ్రి ఎమ్మెల్యే.. కూతురు హీరోయిన్.. బోల్డ్ సీన్లకు కేరాఫ్ అడ్రస్.. ఎవరంటే..

Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-02-07 10:47:26


 తండ్రి ఎమ్మెల్యే.. కూతురు హీరోయిన్.. బోల్డ్ సీన్లకు కేరాఫ్ అడ్రస్.. ఎవరంటే..

తెలుగు వెబ్ మీడియా న్యూస్:- సినీరంగుల ప్రపంచంలో చాలా మంది యువతీ యువకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తారు. అలాంటి ఈ ఇండస్ట్రీలో ఒక రాజకీయ కుటుంబానికి చెందిన అమ్మాయి సినీ ప్రపంచంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని అనేక కలలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు సరైన క్రేజ్ అందుకోలేకపోయింది.

చాలా మంది యువతీయువకులు సినీ ప్రపంచంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తారు. అలాంటి ఒక యువతి రాజకీయ కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. పలు కమర్షియల్ ప్రకటనలలో నటించి ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్స్ అందుకుంది. సినీరంగంలో గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఎమ్మెల్యే కూతురు అయినప్పటికీ తన తండ్రి పేరును ఏమాత్రం ఉపయోగించుకోకుండానే అవకాశాల కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. బోల్డ్ సన్నివేశాల్లో నటించేందుకు సిద్ధమయ్యింది. కానీ ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ.

కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో సైలెంట్ అయిన నేహా.. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. అలాగే తన బోల్డ్ లుక్స్ తో ఎప్పుడూ వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. తన తండ్రి ఎమ్మెల్యే కావడంతో నేహా శర్మ తన రాజకీయ వారసత్వాన్ని వదిలి వేరే కెరీర్‌ను ఎంచుకుంది. నటనలోకి అడుగుపెట్టి 2007లో చిరుత సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన ఈ హీరోయిన్.. ఆ తర్వాత మాత్రం అనుకున్నంతగా అవకాశాలు అందుకోలేదు.

నేహా శర్మ ఇమ్రాన్ హష్మీ సరసన ఒక సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈ నటి అనేక బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. యంగిస్థాన్, తన్హాజీ, యమ్లా పగ్లా దీవానా 2, తుమ్ బిన్ 2, ముబారకన్ వంటి అనేక చిత్రాలలో కనిపించి మెప్పించింది. అలాగే ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ సైతం చేసింది. గ్లామర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయాలనుకున్న నేహా.. అంతగా స్టార్ డమ్ సంపాదించుకోలేకపోయింది. కేవలం 4, 5 చిత్రాల్లో నటించి ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. కొన్నాళ్ల క్రితం తన తండ్రి అజిత్ శర్మ బీహార్‌లోని భాగల్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయగా. తన తండ్రితో కలిసి ప్రచారాల్లో పాల్గొంది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: