Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-02-07 10:34:40
తెలుగు వెబ్ మీడియా న్యూస్: ది మోస్ట్ అవైటెడ్ ఛావా విడుదల దగ్గర పడింది. విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న ఫీమేల్ లీడ్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుంది.. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయా.. వీర శివాజీ వారసుడి కథతో బాక్సాఫీస్ ఎరపెక్కడం ఖాయమేనా.. ఛావా స్పెషల్ స్టోరీ..విక్కీ కౌశల్ రష్మిక జంటగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఇందులో శంభాజీ భార్య ఏసు బాయి పాత్రలో నటిస్తున్నారు రష్మిక. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఫిబ్రవరి 14న సినిమా రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ లంచాలు ఉన్నాయి.శివాజీ చనిపోయాక.. తమకు తిరుగులేదని మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని కలలు కంటున్న మొఘల్స్ పాలిట.. మరీ ముఖ్యంగా ఔరంగజేబు పాలిట శివాజీ తనయుడు శంభాజీ సింహ స్వప్నంగా ఎలా మారారు.. తన సైనికులు ప్రజలతో కలిసి ఏ విధమైన పోరాటం చేసారు.. తండ్రి కలలు కన్న స్వరాజ్యం కోసం ఏం చేసారనేది ఈ చిత్ర కథ.శివాజీ వారసుడిగా ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ లుక్స్ అదిరిపోయాయి. ఛావా అంటే సింహానికి పుట్టిన బిడ్డ అని అర్థం. ట్రైలర్ ఆసాంతం విక్కీ కౌశల్ అద్భుతంగా కనిపించారు. ముఖ్యంగా ఆయన ఎనర్జీ సినిమాకు అదనపు ఆకర్షణ. అలాగే రష్మిక మందన్న సైతం చాలా అద్భుతంగా కనిపించారు.మరాఠా చరిత్ర అంటేనే ముందుగా గుర్తుకొచ్చేవి వాళ్లు చేసిన పోరాటాలు. ఇందులోనూ యాక్షన్ సీక్వెన్సులకు కొదవ లేదు. గూస్ బంప్స్ తెప్పించేలా వీటిని డిజైన్ చేసారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ముఖ్యంగా సింహాన్ని శంభాజీ చీల్చి చెండాడే సన్నివేశం అద్భుతంగా ఉంది. మొత్తానికి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలిక.