Responsive Header with Date and Time

అద్భుతమైన సస్పెన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. ఈ థ్రిల్లర్ సినిమాకు అస్సలు మిస్ అవ్వకండి..

Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-02-07 10:33:00


అద్భుతమైన సస్పెన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. ఈ థ్రిల్లర్ సినిమాకు అస్సలు మిస్ అవ్వకండి..

తెలుగు వెబ్ మీడియా న్యూస్:- ఈ మధ్య కాలంలో హారర్, సస్పెన్స్, సైకలాజికల్ ట్విస్టులు ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఇలాంటి జానర్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఓటీటీలో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం ఓటీటీల్లో ఎక్కువగా థ్రిల్లర్ క్రైమ్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అనుక్షణం ఉత్కంఠభరితమైన, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో కూడిన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ చిత్రంలో ప్రజలు ఆహారం కోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ప్రతి సీన్ ప్రేక్షకులను గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ సినిమా పేరు ‘ది ప్లాట్‌ఫామ్’. ఇది ఎప్పుడూ రక్తం-మాంసం మధ్య ఆహార పోరాటాలను ప్రదర్శించే సినిమా. జైలు నుండి ఒక భయానక దృశ్యాలు కనిపిస్తాయి. మొదటి నుంచి చివరకు ఆద్యంతం ఈసినిమా ఆసక్తిని చూపిస్తుంది. ఆహారం కోసం పోరాటాలతో నిండిన ఈ కథలో మానవ మరణం ఒక థ్రిల్. ఈ సినిమా ఒక ఎత్తైన జైలును చూపిస్తుంది. అందులో పలు అంతస్తులు ఉన్నాయి. ప్రతి అంతస్తులో ఇద్దరు ఖైదీలు ఉన్నారు. వారికి రోజుకు ఒకసారి ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే ఆహారం అందిస్తుంది. ప్రతి అంతస్తులో ఆహారం అందిస్తారు. అది కూడా ఒకే సమయంలో.

పై అంతస్తు నుండి ఆహారం వడ్డించడం ప్రారంభమవుతుంది. చివరి అంతస్తుకు వచ్చే వరకు ఆహారం మిగలదు. దీంతో కింది అంతస్తులలో ఉండేవారు ఆకలితో ఉండాల్సిందే. అయితే ఖైదీలను నెలకు ఒకసారి అంతస్తులు మారుస్తారు. పైన ఉన్నవారు కింద అంతస్తులోకి, కింద ఉన్నవారు పైన అంతస్తులలోకి మారతారు. ఈ జైలులో జరిగే సంఘటనలు, ఆహారం కోసం జరిగే పోరాటాలు, సమాజంలోని ఉన్నత, దిగువ వర్గాల మధ్య వివక్షత గురించి చూపిస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ స్పానిష్ భాషా చిత్రానికి కాల్డర్ దర్శకత్వం వహించారు. 2019లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. చిన్న పిల్లలు ఈ సినిమా చూడకూడదు. ఎందుకంటే సినిమా అంతటా తీవ్ర హింసాత్మక దృశ్యాలు ఉన్నాయి.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: