Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : తాజా వార్తలు Posted on 2025-02-07 10:40:22
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త చెప్పింది.. ఇప్పటికే ఏపీలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందగా తెలంగాణలోనూ గుర్తింపునిస్తూ SEC ఉత్తర్వులిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. 2024లో ఏపీలో 21 ఎమ్మెల్యే, 2 ఎంపి సీట్లు జనసేన గెలిచిన విషయం తెలిసింది. దీంతో రిజిస్టర్డ్ పార్టీ హోదా నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారెంది. ఇకపై గాజు గ్లాసు చిహ్నాన్ని ఎవరికీ కేటాయించరు.