Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2025-01-11 12:26:41
తెలుగు వెబ్ మీడియా న్యూస్: చలికాలంలో తేనె, నల్లమిరియాలు తీసుకోవడం చాలా మంచిదని పోషకాహార నిపుణులు, ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.. ఇది అనేక ఆరోగ్య సమస్యలు నయం చేస్తుందని అంటున్నారు. ఆయుర్వేదంలో తేనె, నల్ల మిరియాలకు ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు. నల్లమిరియాలను తేనెలో కలిపి నమలడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని చెబుతున్నారు.. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సీజనల్ వ్యాధులను దూరం చేస్తుందని అంటున్నారు. మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.జలుబు, దగ్గు, ఫ్లూతో బాధపడేవారికి నల్ల మిరియాలు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం..జలుబు, దగ్గు సమస్యలు ఉన్నవారు ఎండుమిరియాల పొడిని తేనెతో కలిపి తినాలి. ఈ సమస్యలను తొలగించడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.ముక్కు, గొంతు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు రాత్రి పడుకునే ముందు చిటికెడు మిరియాల పొడిని ఒక చెంచా తేనెలో కలిపి తీసుకోండి. మంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు.. డెంగ్యూ ప్రభావాలను తగ్గించడంలో కూడా ఇది మేలు చేస్తుంది. డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు దీన్ని ఒక గ్లాసు నీటిలో కలుపుకుని తాగవచ్చు.
తేనె, నల్లమిరియాలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెరిగేలా చేస్తుంది. విటమిన్ కె, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు తేనెలో ఉంటాయి. నల్ల, తేనెలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇది మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం చిటికెడు నల్లమిరియాలు, తేనెతో కలిపి తిన్న తర్వాత అరగంటపాటు నీళ్లు తాగకూడదు. దీంతో గొంతులో కఫం, నోటి దుర్వాసన, దగ్గు, ఛాతీ బిగుతు వంటి సమస్యలు నయమవుతాయి.తేనెలో నల్ల మరియాలు, కొద్దిగా తులసి ఆకుల రసం కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. శ్వాసనాళంలో వాపును తగ్గిస్తుంది. ఇది శ్వాసకోశాన్ని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. బరువు పెరగడం అనే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి తేనె మిరియాల పొడి మిశ్రమం బెస్ట్ రెమిడీగా పని చేస్తుంది.