Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2025-01-11 12:23:14
తెలుగు వెబ్ మీడియా న్యూస్: అవిసె గింజలు ఆరోగ్యానికి కాదు అందానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్య, సౌందర్యానికీ సహాయపడతాయి. ఇవి చర్మానికి తగినంత తేమను అందించి చర్మాన్ని కోమలంగా మారుస్తాయి. చర్మకణాలలో పేరుకుపోయిన మురికిని తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. చర్మం పై మొటిమలు, మచ్చలు, ముడతలను తగ్గించి చర్మ నిగారింపును పెంచుతాయి.
కెమికల్ ఫేషియల్ చేసుకునే బదులు ఇంట్లోనే నేచురల్ అండ్ కెమికల్ ఫ్రీ ఫేషియల్ చేయించుకోవడం మంచిది. ఇందుకోసం ఒక చెంచా అవిసె గింజలను నీటిలో నానబెట్టి, ముఖంపై సున్నితంగా అప్లై చేసి 2-3 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ముఖంలోని మురికిని తొలగిస్తుంది.అవిసె గింజల పొడిలో కొద్దిగా పెరుగు కలిపి స్క్రబ్‌లా తయారు చేసుకోవాలి. ఈ స్క్రబ్‌ను ముఖంపై సున్నితంగా అప్లై చేసి వృత్తాకారంలో మసాజ్ చేసుకోవాలి. దీని వాడకంతో డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం మృదువుగా కనిపిస్తుంది.
అవిసె గింజలతో మరో విధంగా కూడా అందాన్ని పెంచుకోవచ్చు.. ఇందుకోసం ఒక పాత్రలో వేడి నీటిని తీసుకుని అందులో అవిసె గింజలను వేయాలి. ఆ వేడినీటి నుండి వచ్చే ఆవిరిని ముఖానికి పట్టించాలి. ఇది చర్మ రంధ్రాలను తెరుచుకునేలా చేస్తుంది. చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది.
ఫేస్ మాస్క్ కూడా తయారు చేసుకోవచ్చు..ఇందుకోసం ఫ్లాక్స్ సీడ్స్ జెల్‌లో తేనె, కొంచెం రోజ్ వాటర్ కలపాలి. దీన్ని ముఖానికి బాగా పట్టించి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఈ మాస్క్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ముఖానికి నేచురల్ గ్లో ఇస్తుంది.ఫ్లాక్స్ సీడ్స్ ఫేషియల్ ముఖానికి మంచి టోనింగ్‌గా పనిచేస్తుంది. దీని కోసం ఫ్లాక్స్ సీడ్స్ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపి ముఖంపై స్ప్రే చేయాలి. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది. తెరుచుకున్న రంధ్రాలను మూసివేస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.