Responsive Header with Date and Time

రోజుకు వందల్లో పెట్టుబడితో లక్షల్లో లాభం..

Category : వ్యాపారం | Sub Category : జాతీయ Posted on 2025-01-11 12:22:51


రోజుకు వందల్లో పెట్టుబడితో లక్షల్లో లాభం..

TWM News:- మీరు నెలకు రూ. 5 వేలు లేదా రూ. 10 వేలు ఆదా చేయాలనుకుంటున్నారా.? అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మీకు తెలియట్లేదా? కంగారొద్దు. మీరు కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్న పోస్టాఫీస్ పథకాల్లో నెలకు ఇంత మొత్తం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటీకి లక్షల్లో రిటర్న్స్ పొదే అవకాశం ఉంటుంది. ఇక్కడ చిన్న మొత్తాల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ మద్దతు ఉంటుంది కాబట్టి ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీగా రిటర్న్స్ పొందొచ్చు. పోస్టాఫీసు పథకాలు చాలానే ఉన్నప్పటికీ.. అన్నీ వేటికవే ప్రత్యేకతల్ని కలిగి ఉంటాయి. మహిళల కోసం, ఆడపిల్లల కోసం, ఉద్యోగుల కోసం, సీనియర్ సిటిజెన్ల కోసం ఇలా చాలానే పథకాలు ఉన్నాయి. ఇందులో ఒక పథకం గురించి మనం ఇప్పుడు చూద్దాం.

ఇదే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఒకటైన పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్. దీంట్లో ప్రస్తుతం జనవరి- మార్చి త్రైమాసికానికి గానూ వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది. కనీసం రూ. 100 నుంచి ఇందులో పెట్టుబడులు పెట్టొచ్చు. గరిష్ట పరిమితి ఏం లేదు. సింగిల్‌గా లేదా జాయింట్‌గా ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉంది. మైనర్ పేరిట గార్డియెన్ అకౌంట్ తెరవొచ్చు. పదేళ్లు పైబడిన వారు సొంతంగా అకౌంట్ తెరవొచ్చు. ఎన్ని అకౌంట్లు అయినా ఓపెన్ చేయొచ్చు.

అయితే ఇక్కడ పెట్టుబడులపై లోన్ కూడా తీసుకోవచ్చు. అకౌంట్ తెరిచిన మూడేళ్ల తర్వాత ముందస్తుగా అకౌంట్ ఉపసంహరించుకోవచ్చు. ఇక మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లుగా ఉంది. అకౌంట్ మెచ్యూరిటీ తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంది. అంటే మొత్తం పది సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయొచ్చు.

ఉదాహరణకు ఇప్పుడు మనం ఇందులో నెలకు రూ. 5 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే.. 6.7 శాతం వడ్డీ రేటు ప్రకారం.. ఐదేళ్లకు మీ పెట్టుబడి రూ. 3 లక్షలు కాగా.. వడ్డీ రూపంలో రూ. 56,830 వస్తుంది. అదే మరో ఐదేళ్లు పొడిగిస్తే అప్పుడు చేతికి రూ. 8,54,272 వస్తుంది. ఇక్కడ వడ్డీతోనే రూ. 2.54 లక్షలు అందుకోవచ్చు. నెలకు 5 వేలు అంటే.. రోజుకు రూ. 166 చొప్పున ఆదా చేస్తే సరిపోతుంది. ఇదే నెలకు రూ. 10 వేలతో చూస్తే.. ఐదేళ్లకు వడ్డీతోనే రూ. 1.13 లక్షలు అందుకోవచ్చు. అదే మరో ఐదేళ్లు పొడిగిస్తే ఇక్కడ రూ. 5 లక్షలకుపైగా వడ్డీ పొందొచ్చు. అయితే నెలకు రూ. 15 వేలు, రూ. 20 వేలు ఇలా ఎంతైనా మీ స్థోమతను బట్టి పెట్టుబడి పెట్టొచ్చు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: