Responsive Header with Date and Time

చాహల్-ధనశ్రీల ఆస్తులు ఎంతో తెలుసా.. విడాకుల పుకార్లతో పెరిగిన ఉత్కంఠ

Category : క్రీడలు | Sub Category : జాతీయ Posted on 2025-01-11 12:05:31


చాహల్-ధనశ్రీల ఆస్తులు ఎంతో తెలుసా.. విడాకుల పుకార్లతో పెరిగిన ఉత్కంఠ

తెలుగు వెబ్ మీడియా న్యూస్:భారత క్రికెట్ స్టార్ యుజ్వేంద్ర చాహల్, ఆయన భార్య ధనశ్రీ వర్మ మధ్య విడాకుల పుకార్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 2020లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట ఇటీవల తమ వ్యక్తిగత జీవితంలో గందరగోళం ఎదుర్కొంటున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ధనశ్రీని అన్‌ఫాలో చేయడం, అలాగే విడాకులపై ఒక పరోక్షంగా సంకేతమిచ్చే పోస్ట్‌ను పంచుకోవడం ఈ పుకార్లను మరింత బలపరిచాయి.

ధనశ్రీ వర్మ తన సొంత గుర్తింపును పొందిన కొరియోగ్రాఫర్, దంత వైద్యురాలు. ఆమెకు 2.5 మిలియన్ల ఫాలోవర్లతో యూట్యూబ్ ఛానెల్ ఉంది. ప్రముఖ డ్యాన్స్ షోల్లో పాల్గొనడం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ధనశ్రీ ఆస్తుల విలువ సుమారు రూ. 24 కోట్లుగా ఉంది. మ్యూజిక్ వీడియోలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ఆమె ఆదాయం సంపాదిస్తోంది.

మరోవైపు, యుజ్వేంద్ర చాహల్ క్రికెట్‌లో తన అద్భుత ప్రదర్శనతో పేరుగాంచాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున అతను రూ. 18 కోట్లకు అమ్ముడయ్యాడు, దాంతో మొత్తం రూ. 45 కోట్ల ఆస్తుల్ని కలిగి ఉన్నాడు. వీరి ఆస్తుల విలువను కలిపి చూస్తే సుమారు రూ. 69 కోట్లు అవుతుంది.విడాకుల ప్రక్రియలో ఆస్తి విభజనపై కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ధనశ్రీ త్వరలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించబోతోందని తెలుస్తోంది. ఈ పుకార్లు ఎంతవరకు నిజమో తెలియదుగానీ, ఈ జంట మధ్య కలహాలు వారి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాయి.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: