Category : వ్యాపారం | Sub Category : జాతీయ Posted on 2025-01-11 12:02:39
TWM News:- భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో రకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. పేద కుటుంబాలు తక్కువ ధరల్లో ఎక్కువ దూరం ప్రయాణించే విధంగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే రెండేళ్లలో 50 వరకు అమృత్ భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు..
అమృత్‌భారత్ వెర్షన్ 2.0 రైళ్లలో కొత్తగా 12 రకాల మార్పులు చేపట్టినట్లు తెలిపారు. దీని నిర్మాణ సమయంలో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్నట్లు చెప్పారు.ఉంచుకుంటారు. ఈ మేరకు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ సుబ్బారావుతో కలిసి శుక్రవారం కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. అమృత్ భారత్ రైళ్లతో పాటు, వందేభారత్ 2.0 స్లీపర్ రైళ్ల తయారీని పరిశీలించారు.అలాగే తమిళనాడు ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలని అన్నారు. కేంద్రం, ఆయన మంత్రిత్వ శాఖ ప్రజల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కాగా, అమృత్ భారత్ మొదటి ఎడిషన్‌ను 2024 జనవరిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. అమృత్ భారత్ రెండో ఎడిషన్ రైళ్లను ఇక్కడ తయారు చేయడం చాలా ఆనందంగా ఉందని, గత ఒక సంవత్సరం అనుభవం ఆధారంగా, అమృత్ భారత్ రెండవ ఎడిషన్‌లో అనేక రకాల మార్పు చేర్పులు చేస్తున్నట్లు చెప్పారు.