Responsive Header with Date and Time

సింగిల్ తీస్తే హాఫ్ సెంచరీ.. రన్ కోసం వెళ్తే ఊహించని ప్రమాదం.. కట్‌చేస్తే

Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-01-11 12:00:28


సింగిల్ తీస్తే హాఫ్ సెంచరీ.. రన్ కోసం వెళ్తే ఊహించని ప్రమాదం.. కట్‌చేస్తే

తెలుగు వెబ్ మీడియా న్యూస్: శ్రీలంక జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో ఉంది. టీ20 తర్వాత ఇరు జట్లు వన్డే సిరీస్‌లో తలపడుతున్నాయి. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆక్లాండ్‌లో జరిగింది. జనవరి 11, శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంకకు ఘోర ప్రమాదం జరిగింది. హాఫ్ సెంచరీ పూర్తి చేయడానికి సింగిల్ తీసే క్రమంలో ఊహించని ప్రమాదం జరిగింది. దీంతో హాఫ్ సెంచరీపై కన్నేసిన నిస్సాంక తన తుఫాను ఇన్నింగ్స్‌ను మధ్యలోనే వదిలేసి మైదానం నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. అసలు ఆయనకు ఏం జరిగిందో ఓసారి చూద్దాం..

నిస్సాంకకు ఏమైంది?

ఇప్పటికే శ్రీలంక జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయింది. అందుకే మూడో మ్యాచ్‌లో రాణించాలని నిర్ణయించుకున్న అతను టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీనికి ఓపెనర్లు పూర్తి మద్దతు పలికి తొలి ఓవర్ నుంచే దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించారు. ముఖ్యంగా నిస్సాంక పవర్ ఫుల్ బ్యాటింగ్ చేశాడు. అతను కేవలం 29 బంతుల్లో 49 పరుగులు చేశాడు. దీని తర్వాత అతను డాట్ బాల్స్ ఆడాడు. తన అర్ధ సెంచరీని పూర్తి చేయడానికి తదుపరి బంతికి సింగిల్‌ తీసేందుకు ప్రయత్నించాడు. అతను పరుగు పూర్తి చేసినప్పటికీ, అది అతనికి ప్రాణాంతకంగా మారింది. దీంతో అతను గాయపడ్డాడు.

నొప్పి ఎక్కువ కావడంతో.. నేలమీదే పడిపోయాడు. దీంతో మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఫిజియో వెంటనే రంగంలోకి దిగి అతడిని పరీక్షించాడు. కొంత చికిత్స తర్వాత అతను లేవగలిగాడు. కానీ, బ్యాటింగ్ చేసే పరిస్థితి లేదు. అందువల్ల, అతను 31 బంతుల్లో 50 పరుగుల తన తుఫాను ఇన్నింగ్స్‌ను విడిచిపెట్టి, 10వ ఓవర్‌లో డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వెళ్లవలసి వచ్చింది. అయితే, 4 వికెట్లు పతనమైన తర్వాత, నిస్సాంక 35వ ఓవర్లో జట్టుకు పునరాగమనం చేశాడు. కానీ, ఈసారి పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. అతను 11 బంతుల్లో 16 పరుగులు చేసి 42 బంతుల్లో 66 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

తడబడిన శ్రీలంక జట్టు..

పాతుమ్ నిస్సాంక నిష్క్రమించిన వెంటనే శ్రీలంక టీం చెదిరిపోయింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే 33 బంతుల్లో 17 పరుగులు చేసి సహచర ఓపెనర్ ఔటయ్యాడు. అయితే, ఆ తర్వాత కమెందు మెండిస్, కుశాల్ మెండిస్‌లు కలిసి ఇన్నింగ్స్‌ బాధ్యతలు చేపట్టి 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం 156 పరుగుల వద్ద కుశాల్ మెండిస్ వికెట్ పడింది. ఆ తర్వాత శ్రీలంక జట్టు తడబడింది. వికెట్లు కోల్పోవడం ప్రారంభమైంది. 204 పరుగుల వద్ద సగం మంది పెవిలియన్‌కు చేరారు. ఆరంభం బాగానే ఉన్నప్పటికీ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగలిగింది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: