Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-01-11 11:48:33
తెలుగు వెబ్ మీడియా న్యూస్: భారతదేశంలోనే ఫస్ట్ టైమ్ ఇన్‌ఫ్రా రెడ్ కెమెరాతో షూట్ చేసిన పాటగా నానా హైరానా గురించి డైరెక్టర్ శంకర్ ఎన్నో ఎలివేషన్లు ఇచ్చాడు. కానీ తీరా గేమ్ ఛేంజర్ రిలీజయ్యాక ఆ పాట సినిమాలో లేదు. టెక్నికల్ రీజన్స్ వల్ల మంచి క్వాలిటీ కోసం లేటైందని, జనవరి 14 నుంచి ఆ సాంగ్ ను సినిమాలో యాడ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.గతేడాది దేవర సినిమాలో దావూది సాంగ్ కూడా ఇలానే చేశారు. ముందుగా లెంగ్త్ కోసమని ట్రిమ్ చేశారు కానీ తర్వాత ఓ పది రోజులకు మళ్లీ సాంగ్ ను యాడ్ చేసి మంచి ఫలితాన్ని అందుకున్నారు. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ నిడివి దృష్ట్యా సాంగ్ ను జోడిస్తే టాక్ పరంగా ఎఫెక్ట్ చూపించే అవకాశమైతే ఉంది. నిజానికి ఈ సాంగ్ ఎంతో ఖర్చు చేసి మరీ షూట్ చేశారు.
విదేశీ లొకేషన్లలో భారీ బడ్జెట్ తో షూట్ చేసిన ఈ సాంగ్ కు ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యి ఛార్ట్ బస్టర్ చేశారు. సాంగ్ లో చరణ్, కియారా కెమిస్ట్రీ బావుందని ఫ్యాన్స్ ఎంతో సంబరపడ్డారు. కానీ సినిమాలో ఆ సాంగ్ లేకపోవడంతో వారంతా నిరాశ చెందుతున్నారు. ఏదేమైనా ఇలాంటి విషయాల్లో మేకర్స్ ముందుగానే జాగ్రత్త పడి ఏదొక నిర్ణయం తీసుకోవాలి తప్పించి ఇలా సినిమా రిలీజయ్యాక మరోసారి యాడ్ చేస్తే అన్నిసార్లు అనుకున్న ఫలితాలు వస్తాయని చెప్పలేం. మిక్డ్స్ టాక్‌తో మొదలైన గేమ్ ఛేంజర్ కు రెండు వారాల పాటూ మంచి రన్ ఉంటే తప్ప బ్లాక్ బస్టర్ అవడం కష్టం.