Responsive Header with Date and Time

భారత్‌లో మూడు హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు, భయపడాల్సిన పనిలేదన్న కేంద్ర ఆరోగ్యశాఖ

Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2025-01-07 13:30:13


భారత్‌లో మూడు హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు, భయపడాల్సిన పనిలేదన్న కేంద్ర ఆరోగ్యశాఖ

TWM News:-భారత్‌లో మూడు హ్యుమన్ మెటాన్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) కేసులు వెలుగు చూశాయి.

కర్ణాటకలో సాధారణ పరీక్షల సమయంలో ఐసీఎంఆర్ రెండు హెచ్‌ఎంపీవీ కేసులను గుర్తించిందని ఎక్స్ వేదికగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

గుజరాత్‌లో రెండు నెలల చిన్నారిలో ఈ వైరస్ లక్షణాలు కనబడినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు. రాజస్తాన్‌‌లోని డెంగర్‌పూర్ నుంచి సర్వార్‌కు వచ్చిన చిన్నారి ఈ వైరస్ బారిన పడినట్లు ఆయన వెల్లడించారు.

కర్ణాటకలో నమోదైన రెండు కేసుల్లోనూ పిల్లల్లోనే ఈ వైరస్ కనబడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మూడు నెలల చిన్నారిలో వైరస్ లక్షణాలు కనిపించాయని, చికిత్స తర్వాత కోలుకున్న చిన్నారి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు పేర్కొంది.

8 నెలల వయస్సున్న మరో చిన్నారిలోనూ హెచ్‌ఎంపీవీ వైరస్‌ను గుర్తించారు. బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో ఆ చిన్నారి చికిత్స పొందుతున్నారు. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యులు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించింది.

చైనాలో హెచ్‌ఎంపీవీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

చైనా వేరియంట్ కంటే భారత్‌లోని వైరస్ భిన్నమా’’


కర్ణాటక‌లో తొలి హెచ్‌ఎంపీవీ కేసు నమోదైన తర్వాత ఆరోగ్య మంత్రి దినేశ్ గుండూ రావు, బీబీసీతో మాట్లాడుతూ, భారత్‌లో ఈ వైరస్ ముందు నుంచే ఉన్నందున, దీన్ని హెచ్‌ఎంపీవీ తొలి కేసు అని పిలవడం తప్పు. పిల్లలు ఈ వైరస్ బారిన పడుతున్నారు.

ఈ వైరస్‌కు సంబంధించి ఒకట్రెండు శాతం కేసులు ముందు నుంచే ఇక్కడ ఉన్నాయి. వైరస్ సోకిన చిన్నారి కుటుంబం ప్రయాణం చేసినట్లు రికార్డులేమీ లేవు.

చైనాలోని వేరియంట్ దీనికంటే భిన్నమా? లేదా అనే సంగతి మాకు తెలియదు. వేరే వేరియంట్ ఉందా? మ్యుటేషన్ చెందిందా? అనే విషయాలు కూడా మాకు తెలియదు. వీటికి సంబంధించి భారత ప్రభుత్వం మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదుఅని అన్నారు.

కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం మధ్యాహ్నం తర్వాత వైద్యులతో ఒక సమావేశం నిర్వహించి తాజా పరిస్థితిని సమీక్షించింది. భయపడాల్సిన అవసరం లేదని రావు అన్నారు.

వైరస్ ప్రభావం ఎవరిపై ఎక్కువ ఉంటుందంటే...


కర్ణాటకలో రెండు హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు వెలుగులోకి రావడంతో స్పందించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.

చైనాలో హ్యుమన్ మెటాన్యూమో వైరస్ కేసులు పెరిగిపోతున్నాయంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ, భారత్‌లో నమోదవుతున్న హెచ్‌ఎంపీవీ అనేది జలుబు, ఫ్లూ వంటి లక్షణాలకు కారణమయ్యే సాధారణ వైరస్ని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయెల్ అన్నారు.

భయపడాల్సిన పని లేదు. ఇది శ్వాసకోశ ఇబ్బందులు కలిగించే మామూలు వైరస్. తేలికపాటి లక్షణాలను కలిగి ఉంటుంది. సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు వీలుగా దేశంలోని ఆసుపత్రులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయి ని ఆయన వివరించారు.

వృద్ధులపై, ఏడాది లోపు వయస్సున్న చిన్నారులపై ఇది ప్రభావం చూపుతుంది. కానీ, ఇది తీవ్రమైన వ్యాధి కాదు. ఆందోళన చెందాల్సిన అవసరం చలికాలంలో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు సోకడం సర్వసాధారణం. వీటిని ఎదుర్కోవడానికి మన ఆరోగ్య విభాగాలు, ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయి. రోగులకు సరిపడా వసతులు ఉన్నాయి. దీనికోసం ప్రత్యేక ఔషధాల అవసరం లేదు. డేటా చూస్తే, పెద్దగా కేసులేం నమోదు కావడం లేదు అని ఆయన అన్నారు.

దేశంలో ప్రస్తుత పరిస్థితి మామూలుగా చలికాలంలో ఎలా ఉంటుందో అలాగే ఉందని, దీనిగురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఎస్‌ఆర్ డేటా సూచిస్తోంది.

ఇన్ఫెక్షన్ వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు?


సొంత వైద్యం వద్దు, అంటే సొంతంగా మందులు తీసుకోకూడదు

చేతులను శానిటైజర్‌తో లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోరు, ముక్కుకు రుమాలును అడ్డంగా పెట్టాలి

అనారోగ్యానికి గురైతే జనసమ్మర్థం ఉండే ప్రదేశాల్లోకి వెళ్లడం, ఇతరులను కలవడం మానుకోవాలి

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వాడిన రుమాలును మళ్లీ ఉపయోగించవద్దు

హెచ్‌ఎంపీవీ లక్షణాలు


జ్వరం

దగ్గడం, ముక్కు దిబ్బడ

గొంతు నొప్పి

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

వైరస్ తీవ్రమైతే బ్రాంకైటిస్ లేదా నిమోనియా వచ్చే ప్రమాదం

ఎలా వ్యాపిస్తుంది?


హెచ్‌ఎంపీవీ ఒక అంటువ్యాధి. దగ్గడం, తుమ్మడం వల్ల నోటిలో నుంచి వచ్చే ఉమ్మి వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది.

కరచాలనం, కౌగిలించుకోవడం లేదా ఒకరినొకరు తాకడం వల్ల కూడా ఇది వ్యాప్తి చెందుతుంది.

దగ్గు లేదా ముక్కు కారడం వల్ల ఏదైనా ఉపరితలంపై లాలాజలం పడినప్పుడు, వాటిని తాకిన చేతులతో ముఖం, ముక్కు, కన్ను, నోటిని ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుంది.

ఈ వైరస్ పక్షుల నుంచి పుట్టిందా?


200 నుంచి 400 ఏళ్ల క్రితం పక్షుల నుంచి ఈ వైరస్ పుట్టిందని సైన్స్ డైరెక్ట్‌లో ఉంది. కానీ, అప్పటి నుంచి ఈ వైరస్ పదేపదే మారుతోంది. ప్రస్తుతం పక్షులకు ఈ వైరస్ సోకడం లేదు.

2001లో ఈ వైరస్‌ను మనుషుల్లో గుర్తించినట్టు అమెరికా ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది.

దీనివల్ల, జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

ఇన్‌ఫెక్షన్ పెరుగుతున్నప్పుడు, బ్రాంకైటిస్ లేదా న్యూమోనియాకు కూడా కారణం కావొచ్చు.

ఈ వైరస్ ఇంక్యుబేషన్ పిరియడ్ సాధారణంగా మూడు నుంచి ఆరు రోజులు ఉంటుంది. అనారోగ్యం స్వల్ప కాలం లేదా దీర్ఘకాలం ఉండొచ్చు. ఇది ఇన్‌ఫెక్షన్ తీవ్రతను బట్టి ఉంటుంది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: