Responsive Header with Date and Time

మీరు తినే పన్నీర్ నకిలీ కావొచ్చు! - ఓసారి చెక్​ చేసుకుంటే బెటర్!

Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2025-01-08 13:10:21


మీరు తినే పన్నీర్ నకిలీ కావొచ్చు! - ఓసారి చెక్​ చేసుకుంటే బెటర్!

TWM News:-సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నకిలీ పన్నీరు పట్టుబడింది. పక్కా సమాచారంతో ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించగా, మచ్చ బొల్లారంలోని ఓ గోదాములో 600 కిలోల నకిలీ పన్నీరు బయటపడింది. దీంతో ఎస్వోటీ పోలీసులు 600 కిలోల నకిలీ పన్నీర్‌ జప్తు చేశారు. అలాగే గోదామును సీజ్ చేశారు.


పన్నీరు శాంపిల్స్​ను ల్యాబ్ పంపిన ఎస్వోటీ పోలీసులు : నటరాజ్ మిల్క్ ట్రేడర్స్ పేరుతో గత కొన్నాళ్లుగా యథేచ్చగా నకిలీ పన్నీరు క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు ఎస్వోటీ పోలీసులు తెలిపారు. పాల పౌడర్, పామాయిల్, ఇతర రసాయనాలను ఉపయోగించి పన్నీరు తయారు చేస్తున్నట్లు వారు గుర్తించారు. నకిలీ పన్నీర్​ను ఓ గోదాము కేంద్రంగా తయారు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బేగంబజార్​కు చెందిన విశాల్ అనే వ్యక్తి ఈ నకిలీ పన్నీరు తయారి కేంద్రాన్ని నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఎస్వోటీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన అల్వాల్ పోలీసులు, వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. నకిలీ పన్నీరు శాంపిల్స్​ను తీసుకున్న ఎస్వోటీ పోలీసులు ల్యాబ్​కు పంపారు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: