Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-01-08 12:39:40
తెలుగు వెబ్ మీడియాన్యూస్:అంతేకాకుండా రజనీ విగ్రహం ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేస్తున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో.. ఇప్పుడీ విషయం సూపర్ స్టార్ రజనీ కాంత్ దాకా వెళ్లింది. ఈ విషయం తెలిసిన ఆయన తనకు గుడి కట్టించిన వీరాభిమాని కార్తీక్ అతని కుటుంబ సభ్యులను చెన్నై, పోయస్ గార్డెన్లోని తన ఇంటికి పిలిపించారు. తన అభిమాని కుటుంబంతో ప్రత్యేకంగా ముచ్చటించారు. అలాగే బాబా విగ్రహాన్ని కానుకగా తన అభిమానికి అందించారు రజినీకాంత్. చివరిగా వారికి రుచికరమైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ ఫోటోలు కూడా ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. దీనిని చూసిన రజనీకాంత్ అభిమానులు తమ హీరోతో పాటు కార్తీక్ పైనా ప్రశంసలు కురిపిస్తున్నారు