Responsive Header with Date and Time

భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!

Category : వ్యాపారం | Sub Category : జాతీయ Posted on 2025-01-08 13:42:29


భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!

TWM News:-ఎప్పటినుంచో హెచ్ 1 బీ వీసాదారులు ఎదురుచూస్తున్న తరుణం భారతీయులకు రానే వచ్చింది. హెచ్ 1 బీ వీసాల రెన్యువల్ ప్రక్రియలో ఎప్పటినుంచో చూస్తున్న ఊరటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వివరాలను వెల్లడించింది..అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త. హెచ్-1బీ వీసా రెన్యువల్ కోసం అమెరికా ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. ఇప్పుడు స్వదేశానికి రాకుండానే అమెరికాలో భారతీయలు తమ వీసా రెన్యువల్ చేసుకోవచ్చు. అమెరికా త్వరలో వీసా పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోందని, దీని కిందహెచ్-1బీ వీసా హోల్డర్లు దేశం విడిచి వెళ్లకుండానే తమ పత్రాలను పునరుద్ధరించుకోవచ్చని న్యూఢిల్లీలోని US ఎంబసీ తెలిపింది.

 హెచ్ 1 బీ వీసా హోల్డర్ల కోసం యూఎస్‌ ఆధారిత పునరుద్ధరణ కార్యక్రమం ఈ సంవత్సరం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది వివిధ రకాల నిపుణులు, భారతీయ కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తమ వీసాను పునరుద్ధరించడానికి ఇంటికి తిరిగి రావాల్సి వస్తుంటుంది. హెచ్ 1 బీ వీసాలను రెన్యూవల్‌, రీఫిల్ చేయడానికి భారతదేశానికి తిరిగి రావడం USలో నివసిస్తున్న భారతీయ కార్మికులకు చాలా కాలంగా ఆందోళన కలిగిస్తుంది.


 హెచ్ 1 బీ వీసాలను పునరుద్ధరించే పైలట్ ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఇది సాధ్యమైందని US ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పైలట్ ప్రోగ్రామ్ వేలాది మంది దరఖాస్తుదారుల వీసాలను పునరుద్ధరించింది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: